NTV Telugu Site icon

Gadar 2: ఓటిటీలో గదర్.. ఎప్పటినుంచి అంటే.. ?

Gadar

Gadar

Gadar 2: బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్న విషయం తెల్సిందే. కథ కథనాలు బావున్నా.. ఎందుకో ప్రేక్షకులను అలరించలేకపోతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఆగస్టు లో రిలీజ్ అయ్యింది గదర్. సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా అనిల్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 11 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అయితే 2001 లో వచ్చిన గదర్ సినిమాకు ఈ సినిమ సీక్వెల్ గా తెరకెక్కింది. అయినా కూడా ఆ సినిమా ప్రేక్షకులను ఎంత అలరించిందో.. దాని సీక్వెల్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక భారీ కలక్షన్స్ అందుకొని బాలీవుడ్ కు షాక్ ఇచ్చింది. 17 రోజుల్లో ఈ సినిమా దాదాపు రూ. 593 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ఇక ఈ సినిమా ఓటిటీ లో ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటిటీ రిలీజ్ పై డైరెక్టర్ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చాడు.

Karun Nair: అప్పుడలా.. ఇప్పుడిలా.. మళ్లీ తనను తలుచుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్

“సినిమా చాలా బాగా థియేటర్ లో కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్ లోనే చూడడానికి ఇష్టపడుతున్నారు. అలాగే కొనసాగనిస్తాం. నాకు తెలిసి ఇప్పుడప్పుడే ఈ సినిమా ఓటిటీలోకి రాదు. మరో ఆరునెలలు వరకు ఓటిటీకి ఈ సినిమా ఇవ్వాలనుకోవడం లేదు” అని చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు నిరాశకు గురి అయ్యారు. సాధారణంగా ఎంత హిట్ సినిమా అయినా కూడా 2 నెలల్లో ఓటిటీ స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ సినిమా 6 నెలలు అంటే ఎక్కువ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి డిజిటల్ హక్కులు కొన్నవారు ఏమంటారో చూడాలి.