NTV Telugu Site icon

Gaami: అఘోరగా మారిన విశ్వక్ సేన్.. భయపెట్టేస్తున్నాడుగా

Gaami

Gaami

Gaami: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రేక్షకుల‌లో తనదైన ముద్ర వేసుకున్నాడు. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లు చేయడంతో పాటు యూనిక్‌ కాన్సెప్ట్‌లతోనూ ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ధమ్కీ సినిమా తరువాత విశ్వక్ ప్రేక్షకుల ముందు రాలేదు. ఇక తాజాగా విశ్వక్ నటిస్తున్న చిత్రం గామి.
విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు. ఈ అడ్వెంచర్ డ్రామాని వి సెల్యులాయిడ్ సమర్పిస్తోంది. ఈ చిత్రానికి క్రౌడ్ ఫండ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో విశ్వక్ అఘోరాగా కనిపించనున్నాడు. తాజాగా మేకర్స్ హైదరాబాద్ కామిక్ కాన్‌లో ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ ద్వారా ప్రమోషన్‌లను ప్రారంభించారు.

అఘోరా గెటప్‌లో విశ్వక్ సేన్ ఆశ్చర్యపరిచారు. పోస్టర్ ఆకట్టుకుంటుంది. చుట్టూ చాలా మంది అఘోరాలు అతనిని తాకడానికి ప్రయత్నిస్తారు. పోస్టర్ టెర్రిఫిక్ గా వుంది. డార్క్ మిస్టీరియస్ ఫీలింగ్ ని కలిగిస్తోంది. ఆడియన్స్ లో చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ ‘శంకర్’ అనే అఘోరాగా కనిపించనున్నాడు. తనకి చాలా రేర్ కండీషన్ వుంటుంది. అతను ఏ మానవ స్పర్శను అనుభవించలేడు అని మేకర్స్ అనౌన్స్ చేశారు. పోస్టర్‌పై “His biggest fear, is human touch… His deepest desire, is also human touch” అనే ట్యాగ్‌లైన్ వుంది. ఇది ఆ పాత్ర భావోద్వేగ సంఘర్షణ యొక్క లోతును తెలిజేస్తుంది.

దర్శకుడు విద్యాధర్ మాట్లాడుతూ, “ఈ చిత్రంలో అఘోరా సెటప్‌తో పాటు, రెండు విభిన్నమైన సెటప్‌లు, ఇతర పాత్రలు ఉన్నాయి. ప్రమోషన్స్ లో వాటి గురించి రివిల్ చేస్తాం” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రంలో కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి కథానాయికగా నటిస్తుండగా, ఎంజి అభినయ, హారిక, మహ్మద్ సమద్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు. మరి ఈ సినిమాతో విశ్వక్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Show comments