Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Gaali Medalu Completed 60 Years

60 ఏళ్ళ ‘గాలి మేడలు’

Published Date :February 9, 2022 , 6:00 am
By Subbarao N
60 ఏళ్ళ ‘గాలి మేడలు’
  • Follow Us :
  • google news
  • dailyhunt

నటరత్న యన్‌.టి.రామారావు హీరోగా దర్శక-నిర్మాత బి.ఆర్.పంతులు తమ పద్మినీ పిక్చర్స్ పతాకంపై జనరంజకమైన చిత్రాలు రూపొందించారు. వాటిలో ‘గాలిమేడలు’ ఒకటి. 1962 ఫిబ్రవర 9న విడుదలైన ‘గాలిమేడలు’ విశేషాదరణ పొందింది. ఇందులో దేవిక నాయికగా నటించగా, యస్.వి.రంగారావు, చిత్తూరు నాగయ్య కీలక పాత్రలు పోషించారు.

‘గాలిమేడలు’ కథ విషయానికి వస్తే – రంగనాథం అనే షావుకారు టీబీ రోగంతో బాధపడుతూ ఉంటారు. తాను చికిత్స నిమిత్తం వెళ్తూ, తన కొడుకు కృష్ణ ఆలనాపాలనా పానకాలు అనే నమ్మకస్థునికి అప్పగిస్తాడు. రంగనాథం ఇచ్చిన పైకంతో వేరే ఊరువెళ్ళి పొలాలు కొని స్థిరపడతాడు పానకాలు. సొంతవూరివారికి తాము రంగూన్ పోతున్నట్టు చెబుతాడు. దాంతో అందరూ పానకాలు రంగూన్ వెళ్ళారని భావిస్తూ ఉంటారు. రంగనాథం వచ్చే సరికి పానకాలు రంగూన్ వెళ్ళాడని తెలుసుకొని తానూ అక్కడకు వెళతాడు. కొంతకాలానికి పానకాలుకు ఓ కొడుకు పుడతాడు. అతని పేరు మోహన్. అతణ్ణి చదివిస్తూ, కృష్ణను పొలం పనులకు వాడుకుంటాడు పానకాలు. అతని దూరం చుట్టం కూతురు లక్ష్మి, కృష్ణను ప్రేమిస్తుంది. లక్ష్మిని తన కొడుకు మోహన్ కు ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు పానకాలు. అయితే ఆమె కృష్ణను ప్రేమిస్తుందన్న విషయం తెలిసి, కృష్ణను ఇంట్లోంచి వెళ్ళగొడతాడు. కానీ, పట్నంలో మోహన్, ఓ జమీందార్ కూతురును ప్రేమించి ఉంటాడు. ఈ విషయం తెలిసి, పానకాలు, లక్ష్మికి మాయమాటలు చెప్పి, కృష్ణను వెదికి తీసుకు రమ్మని చెబుతాడు. ఆమె అమాయకంగా కృష్ణకోసం పట్నం పోతుంది. కోటీశ్వరుడై తిరిగి వచ్చిన రంగనాథం, పానకాలు కోసం వెదుకులాట ప్రారంభిస్తాడు. ఏ రోజుకైనా తన కొడుకు తన దరి చేరుతాడని ఆశిస్తూ ఉంటాడు. అదే సమయంలో రంగనాథం ఇంట్లో కృష్ణ పనివాడుగా చేరి అతని అభిమానం సంపాదిస్తాడు. మోహన్ డబ్బు కోసమే తన కూతురిని ప్రేమించాడని, అతని తండ్రి పానకాలు కూడా మోసగాడని తెలుసుకున్న జమీందార్ వారిని బయటకు పంపుతాడు. కాలు కూడా పోగొట్టుకున్న పానకాలు బికారి అవుతాడు. పశ్చాత్తాపం చెందుతాడు. ఈ లోగా మోహన్ కు రంగనాథం విషయం తెలుస్తుంది. తానే అతని కొడుకునని ఆయన పంచన చేరతాడు. అక్కడ కృష్ణ, మోహన్ ను చూసి మోసం చేస్తున్నావని హెచ్చరిస్తాడు. ఆ రాత్రి రంగనాథం ను చంపాలని మోహన్ ప్రయత్నిస్తాడు. కృష్ణ రక్షిస్తాడు. పానకాలు కూడా అక్కడకు చేరుకొని, అసలు విషయం బయట పెడతాడు. మోహన్ తన కొడుకని, కృష్ణనే రంగనాథం తనయుడన్న నిజం చెబుతాడు. చివరకు కృష్ణ, లక్ష్మి పెళ్ళితో కథ సుఖాంతమవుతుంది.

ఈ చిత్రంలో కృష్ణగా యన్టీఆర్, మోహన్ గా జగ్గయ్య, పానకాలుగా ఎస్.వి.రంగారావు, రంగనాథంగా చిత్తూరు వి.నాగయ్య, లక్ష్మిగా దేవిక నటించారు. మిగిలిన పాత్రల్లో జయంతి, రమణారెడ్డి, రాజనాల, సురభి బాలసరస్వతి, ఎమ్.వి.రాజమ్మ, విశ్వనాథం, పేకేటి శివరామ్, రమాదేవి, రాజేశ్వరి నటించారు.

ఎమ్.ఎస్.సోలమలై రాసిన మూలకథకు దాదా మిరాసి, పద్మినీ పిక్చర్స్ సంస్థ కథావిభాగం కలసి స్క్రీన్ ప్లే సమకూర్చారు. డి.వి.నరసరాజు మాటలు రాసిన ఈ చిత్రానికి సముద్రాల, కొసరాజు, ఆది శేషారెడ్డి, రామచంద్ పాటలు పలికించారు. టి.జి.లింగప్ప సంగీతం సమకూర్చారు. తరువాతి రోజుల్లో కన్నడ నాట ప్రఖ్యాత దర్శకునిగా పేరొందిన ఎస్.ఆర్.పుట్టన్న కణగల్ ఈ చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేశారు. ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో బి.ఆర్.పంతులు నిర్మించారు.

“ఈ మూగ చూపేలా…బావా మాటడగా నేరమా…”, “మమతలు లేని మనుజులలోన…” పాటలను సముద్రాల రాయగా, “కృష్ణా…మంచి మాటేరా…”, “నవరాగాలు…” అంటూ సాగే పాటలను రామ్ చంద్ రాశారు. “ఓ రాయుడో…”, “గాలి మేడ కూలిపోయెరా…” పాటలను ఆదిశేషారెడ్డి రాయగా, “టీ షాపులోని పిల్లా…” పాటను కొసరాజు పలికించారు.

ఇదే కథతో కన్నడలో రాజ్ కుమార్, కళ్యాణ్ కుమార్, లీలావతి ప్రధాన పాత్రధారులుగా ‘గాలి గోపుర’ పేరుతో బి.ఆర్.పంతులు ఓ చిత్రం రూపొందించారు. ‘గాలిమేడలు’ కంటే రెండు రోజులు ముందుగా ఆ సినిమా విడుదలయింది. రెండు చిత్రాలు విజయం సాధించాయి. చిత్రమేమంటే, బెంగళూరు, బళ్ళారి వంటి కేంద్రాలలో రెండు సినిమాలు ఒకే సమయంలో ప్రదర్శితమయ్యాయి. కన్నడనాట ఎంతో సుప్రసిద్ధమైన పురందరదాసు విరిచితమైన “యారిగే యారంటూ..” కీర్తనను చిత్రానికి అనువుగా ఉపయోగించుకున్నారు. అదే పాటను తెలుగులో సముద్రాల “మమతలు లేని మనుజులలోన ఎవరికి ఎవరో తండ్రీ తనయులు ఎవరో…” అంటూ రాసి అలరించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 60 years completed
  • Devika
  • gali medalu
  • Nandamuri Taraka Ramarao
  • old classic

తాజావార్తలు

  • Oscars 2026 : ఆస్కార్ బెస్ట్ యాక్టర్ గా నల్లజాతీయుడి అరుదైన రికార్డు

  • YS Jagan: మీరే రాష్ట్ర భవిష్యత్తు.. 10వ తరగతి విద్యార్థులకు వైఎస్ జగన్ ఆల్ ది బెస్ట్!

  • Telangana Assembly Budget Sessions: నేటి నుండే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.!

  • Cuttack Hospital Fire Accident: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది రోగులు మృతి.!

  • Ustaad Bhagat Singh: కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆ కోరిక ఉండేది.. పవన్‌ కళ్యాణ్‌పై మనసులో మాట చెప్పిన రాశి ఖన్నా

ట్రెండింగ్‌

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions