Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ ఈ లోకాన్ని విడిచి వెళ్లి వారం దాటింది. అయినా ఆయన లేరు అన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఈరోజు మహేష్ బాబు తన తండ్రి అస్థికలను కృష్ణా నదిలో నిమజ్జనం చేసి వచ్చిన విషయం తెల్సిందే. ఎప్పటినుంచో నుంచి వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణకు గుండెపోటు రావడం, ఆ సమయంలో తాను అక్కడ లేకపోవడం వలన అన్న కృష్ణను దక్కించుకోలేకపోయానని కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరిరావు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో కృష్ణ మరణం ముందు రోజు ఏం జరిగింది అనేది చెప్పుకొచ్చారు. ” అన్నయ్య ఆ నైట్ వరకు ఎంతో ఆరోగ్యంగానే ఉన్నారు.. చాలా హుషారుగానే కనిపించారు. నన్ను అక్కడే భోజనం చేయమని చెప్పినా తన ఇంట్లో వేరే వాళ్లని లంచ్ పిలవడం వల్ల మళ్లీ వస్తానని చెప్పి వచ్చేశా. ఆరోజు రాత్రి డిన్నర్ తర్వాత రాత్రి 12 తర్వాత అన్నయ్య కు గుండెపోటు వచ్చింది.
అన్నయ్య కేర్ టేకర్ గా ఉన్న కుర్రాడు అన్నయ్య పల్స్ చెక్ చేస్తే ఎర్రర్ రావడంతో కంగారుగా నాకు కాల్ చేశాడు. అన్నయ్యని హాస్పిటల్ కి తీసుకురమ్మని చెప్పి నేను కూడా హాస్పిటల్ కు వెళ్ళాను. హార్ట్ స్ట్రోక్ వచ్చిన 20 నిమిషాల లోపు హాస్పిటల్ కి చేరి వైద్యం అందితే ఫలితం ఉండేది. ఆలస్యం అవడంతో ఆ ఎఫెక్ట్ మిగతా ఆర్గాన్స్ మీద పడ్డది అని డాక్టర్లు చెప్పారు. రక్త ప్రసరణ ఆగిపోయిందని, బతకడం కష్టమని చెప్పారు. దాదాపు 30 గంటలు శ్రమించినా అన్నయ్యను కాపాడుకోలేకపోయాం. అన్నయ్య ను కాదు ఒక మంచి స్నేహితుడును కోల్పోయాను” అని ఆయన ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
