Site icon NTV Telugu

Babloo : ఒకప్పుడు స్టార్ కమెడియన్.. ఇప్పుడు డీజే ఆపరేటర్

Babloo

Babloo

Babloo : సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి పొజీషన్ కు వెళ్లిన తర్వాత కూడా కొందరు అవకాశాలు రాక బయటకు వచ్చేస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి కమెడియన్ ఒకతను ఇప్పుడు డీజే ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అతనే కమెడియన్ బబ్లూ. తేజ తీసిన చిత్రం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో కనిపించాడు. పవన్ కల్యాణ్‌, అల్లు అర్జున్ సినిమాల్లో కూడా చేశాడు. కమెడియన్ గా బిజీ అవుతున్న టైమ్ లోనే తన ఇంట్లో వరుసగా ఒక్కొక్కరు చనిపోయారు.

Read Also : Allu Shirish : తన లవ్ స్టోరీ ఎలా మొదలైందో చెప్పిన శిరీష్

ఆ బాధను తట్టుకోలేక ఇంట్లోనే డిప్రెషన్ లో ఉండిపోయాడు. ఆ టైమ్ లో చాలా మంచి సినిమా ఛాన్సులు మిస్ చేసుకున్నానని తెలిపాడు బబ్లూ. కానీ ఖాళీగా ఉండకుండా డీజే ఆపరేటర్ గా పనిచేసుకుంటున్నాడు. అతని ఇన్ స్టా ఓపెన్ చేసి చూస్తే ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటు చిన్నా, చితక సినిమాల్లో పాత్రలు చేస్తూనే మిగతా టైమ్ లో డీజే ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. తనకు డీజే నుంచి కూడా మంచి ఆదాయం ఉందందటున్నాడు. గత పదేళ్లుగా ఇదే ఫీల్డ్ లో ఉన్నట్టు తెలిపాడు బబ్లూ. ఇప్పటికీ తనకు మంచి అవకాశాలు వస్తే నటించేందుకు రెడీ అంటున్నాడు.

Read Also : Singer Chinmayi : లైంగిక వేధింపులను ప్రోత్సహించడమే.. జానీ మాస్టర్ పై చిన్మయి సంచలనం

Exit mobile version