NTV Telugu Site icon

Court Movie : కోర్టు మూవీ మొదటి వారం కలెక్షన్లు ఎంతంటే..?

Shivaji

Shivaji

Court Movie : నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో రామ్ జగదీశ్ డైరెక్ట్ చేసిన మూవీ కోర్టు. ఈ మూవీ రిలీజ్ అయిన రోజు నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. శివాజీ, ప్రియదర్శి, హర్షవర్ధన్, హర్ష్‌ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రలు చేసిన ఈ మూవీ ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పటికే లాభాల్లోకి వచ్చేసిన ఈ మూవీ.. విజయవంవతంగా థియేటర్లలో ఆడుతోంది. ఇక మొదటి వారం కలెక్షన్లు దుమ్ములేపుతున్నాయి. మొదటి వారం రూ.39.60 కోట్ల గ్రాస్ ను వసూలు చేసినట్టు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది.

Read Also : Chiranjeevi : వాళ్ల ఇంటికి వెళ్లి భోజనం చేస్తా.. చిరంజీవి ఎమోషనల్

రూ.11 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా.. మొదటి రోజే రూ.8.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఇక రెండోరోజు రూ.15.90 కోట్లు వసూలు చేసి లాభాల్లోకి వచ్చేసింది. ఒక మూవీ రెండో రోజుకే లాభాల్లోకి రావడం అంటే మాటలు కాదు. ఇక అప్పటి నుంచి సక్సెస్ ఫుల్ గా ఆడుతూనే ఉంది. రోజురోజుకూ కలెక్షన్లు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. వారం రోజుల్లోనే ఇంత వసూలు చేసిందంటే.. ఇప్పట్లో పెద్ద సినిమాలు లేవు. పైగా వీకెండ్ లో మూడు రోజులు కలిసి వస్తున్నాయి. కాబట్టి ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు చేయడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్.