Site icon NTV Telugu

Mahesh Babu: ‘గుంటూరు కారం’ ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది!

Ssmb 28 Guntur Kaaram

Ssmb 28 Guntur Kaaram

ఇప్పటి వరకు మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా గురించి పాజిటివ్ కంటే, నెగెటివిటినే ఎక్కువగా స్ప్రెడ్ అయింది. ఈ సినిమా నుంచి సాలిడ్ అప్టేట్ ఇవ్వలేకపోతున్నాడు త్రివిక్రమ్. రీసెంట్‌గా సూపర్ స్టార్ బర్త్ డేకి కూడా ఒకటి రెండు పోస్టర్స్‌తోనే సరిపెట్టారు. అది కూడా స్టార్టింగ్‌లో వచ్చిన పోస్టర్‌ను అటు, ఇటు తిప్పి ఇదే బర్త్ డే ట్రీట్ అన్నారు. అందుకే.. గుంటూరు కారం పై ఊహించని పాజిటివ్ వైబ్ రావాలంటే సాలిడ్ అప్డేట్ రావాల్సిందే. అది కూడా ఫస్ట్ సింగిల్ వస్తే అదిరిపోతుంది. ఒక్క సాంగ్ బయటకి వస్తే గుంటూరు కారం గురించి వచ్చే నెగటివ్ కామెంట్స్ అన్నీ ఎండ్ అవుతాయి. వాస్తవానికి మహేష్ బర్త్ డే రోజే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయాలనుకున్నారు. అందుకోసం తమన్ ఎంత ట్రై చేసినా కుదరలేదు. ఈసారి మాత్రం తమన్ గురి తప్పదంటున్నారు. ఇప్పటికే గుంటూరు కారం టైటిల్‌ సాంగ్‌ రికార్డింగ్ కూడా కంప్లీట్ అయిందట.

Read Also: NTR: ‘దేవర’ కోసం రంగంలోకి దిగిన అనిరుధ్…

తమన్ అదిరిపోయే ట్యూన్‌ ఇవ్వగా, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ కూడా అదరిపోయాయట. దీంతో ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇండిపెండెన్స్ సందర్భంగా… ఆగష్టు 15న గుంటూరు కారం సాంగ్‌ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారట. రేపో మాపో మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని టాక్. ఇక హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీస్ శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అతడు, ఖలేజా తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Exit mobile version