NTV Telugu Site icon

Honeymoon Express: హనీమూన్ ఎక్స్ ప్రెస్ ఎక్కుతానంటున్న చైతన్యరావు

Honeymoon Express

Honeymoon Express

First Look of ‘Honeymoon Express’ unveiled by Akkineni Nagarjuna: 30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు హీరోగా హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించిన “హనీమూన్ ఎక్స్ప్రెస్” రిలీజ్ కి రెడీ అవుతోంది. ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బాల రాజశేఖరుని దర్శకుడుగా వ్యవహరించిన ఈ సినిమాకి కల్యాణి మాలిక్ సంగీతం అందించగా కెకెఆర్ -బాల రాజ్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ కామెడీ మూవీని నిర్మించారు. ఇక తనికెళ్ల భరణి మరియు సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కింగ్ నాగార్జున బిగ్ బాస్ సెట్ లో ప్రత్యేకమైన “కింగ్” రూమ్ లో విడుదల చేశారు. ఈ క్రమంలో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ “దర్శకుడు బాల నాకు సుపరిచితుడు, అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కి డీన్ గా వ్యవహరించి, హాలీవుడ్ సినీ నిర్మాణ పరిజ్ఞానాన్ని మా విద్యార్థులకు పంచి ఇచ్చారని అన్నారు.

CID Actress: కుటుంబ సభ్యులే వేధిస్తున్నారు.. కాపాడండి ప్లీజ్.. పోలీసులను ఆశ్రయించిన సిఐడి నటి

అంతేకాక, మా విద్యార్థులకు, అధ్యాపకులకు ‘హనీమూన్ ఎక్సప్రెస్’ చిత్రం లో అవకాశాలు ఇచ్చాడన్న ఆయన ఈ సినిమా కథ వినోదాత్మకంగా సమాజానికి చక్కని సందేశం కలిగి ఉందని కల్యాణి మాలిక్ పాటలు అద్భుతంగా రొమాంటిక్ గా వచ్చాయని అన్నారు. దర్శకుడు బాల మాట్లాడుతూ నేను లాస్ ఏంజెల్స్ లో ఉంటూ ఎన్నో హాలీవుడ్ చిత్రాలకి పని చేశా, కానీ తెలుగు సినిమా చేయాలి అనేది నా కల, అక్కినేని అమల ప్రోద్భలంతో ఇండియా తిరిగివచ్చి టాలీవుడ్ లో అరంగేట్రం చేశానని అన్నారు. నాకు ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటూ నన్ను ప్రోత్సహిస్తూ నా సినిమా మొదటి పోస్టర్ ను రిలీజ్ చేసిన నాగార్జునకి కృతజ్ఞతలు అని అన్నారు. ‘హనీమూన్ ఎక్స్ప్రెస్’ ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అని చైతన్య రావు, హెబ్బా పటేల్ అద్భుతంగా నటించారని అన్నారు. తనికెళ్ల భరణి – సుహాసిని క్యారెక్టర్లు మా చిత్రానికి హైలైట్ గా ఉంటాయని అన్నారు. అలీ, సురేఖ వాణి, రవి వర్మ, తదితరులు ఇతర నటించిన ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆర్ పి పట్నాయక్ అందించారు.