Site icon NTV Telugu

“హను-మాన్” నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్

First look of Hanuman from the movie will be out on September 18th

“జోంబీ రెడ్డి”తో హిట్ అందుకున్న కాంబోలో మరో సరికొత్త జోనర్ లో మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. యంగ్ హీరో తేజ సజ్జ, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కలిసి మరోసారి “హను-మాన్” ప్రాజెక్ట్ ను తెరకెక్కించబోన్నారు. తెలుగులో మొదటిసారిగా సూపర్ హీరో సినిమా ఇదే కావడంతో ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తిని నెలకొంది. అయితే అప్పుడే సినిమా ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టేశారు మేకర్స్. ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ సెప్టెంబర్ 18 న ఉదయం 10.08 గంటలకు విడుదల కానుంది అంటూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దానిపై “అంజనాద్రి ప్రపంచం నుంచి హనుమంతుడిని మీట్ అవ్వండి” అని రాశారు. దీంతో మునుపెన్నడూ లేని అవతారంలో తేజను చూడాలనే ఉత్సాహం మొదలైంది ప్రేక్షకుల్లో.

Read Also : సత్యభామను పరిచయం చేసిన “బంగార్రాజు”

ప్రీ-లుక్ పోస్టర్ లో హనుమంతుడు నీటిలో పడిపోవడం కన్పిస్తోంది. బహుశా అది సముద్రం అయ్యి ఉండొచ్చు. ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్నిఅత్యాధునిక విఎఫ్ఎక్స్ తో రూపొందించనున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.

Exit mobile version