NTV Telugu Site icon

Sridevi: ఫస్ట్ ఫీమేల్ సూపర్ స్టార్ ఇన్ ఇండియా .. తొమ్మిదిమంది సూపర్ స్టార్స్ తో

Sridevi

Sridevi

Sridevi: అందాల అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం కలగలిపిన రూపం ఆమెది. పాత్ర ఏదైనా.. హీరో ఎవరైనా శ్రీదేవి హీరోయిన్ అంటే.. బొమ్మ బ్లాక్ బస్టర్ అని నమ్మేవారు. బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా ఆమె ఎదిగిన తీరు ఎంతో ఆదర్శప్రాయం. ఎన్నో ఆటుపోట్లు.. మరెన్నో వివాదాలు వేటిని లెక్కచేయకుండా అన్ని భాషల్లో ఎన్నో వందల సినిమాల్లో నటించిన మెప్పించింది. ముఖ్యంగా తొమ్మిది మంది సూపర్ స్టార్స్ తో నటించి ఫస్ట్ ఫీమేల్ సూపర్ స్టార్ ఇన్ ఇండియా గా పేరు తెచ్చుకున్న ఘనత శ్రీదేవిది. టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు.. అన్ని ఇండస్ట్రీలో కూడా ఆమె నటించి మెప్పించింది. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్.. ఇలా స్టార్ హీరోలతో నటించిన ఏకైక హీరోయిన్ శ్రీదేవి. అప్పట్లో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు నిర్మించిన సౌందర్య లహరి షోలో వీరి గురించి శ్రీదేవి మాట్లాడింది.

Ameesha Patel: పవన్ హీరోయిన్.. ఎన్నాళ్లకు ఓ హిట్ కొట్టింది

ఒక్కొక్క హీరో గురించి ఒక్కో విషయం చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ అంటే యుగపురుషుడు అని.. ఏఎన్నార్ అంటే నట సామ్రాట్ అని.. కృష్ణ గురించి చెప్పాలంటే.. ఆయన సెట్ అంటే మంచి ఫుడ్ ఉంటుంది. విజయ నిర్మల గారు చాలా బాగా వండుతారు అని చెప్పుకొచ్చింది. ఇక చిరంజీవి అంటే ఆల్ రౌండర్ అని చెప్పిన శ్రీదేవి.. రాజేష్ ఖన్నా సెట్ లో ఎప్పుడు మూడీగా ఉంటారని చెప్పింది. ఇక అమితాబ్ బచ్చన్.. చాలా డిగ్నిఫైడ్ గా ఉంటారని, సకల కళా వల్లభన్ అని చెప్పుకొచ్చింది. నేడు ఆమె జయంతి సందర్భంగా అభిమానులు అతిలోక సుందరిని మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. ఇలా పాత ఇంటర్వ్యూల్లో శ్రీదేవి మాట్లాడిన మాటలను వైరల్ గా మారుస్తున్నారు.

Show comments