Site icon NTV Telugu

John Abraham : ‘అటాక్’ చేయలేకపోయాడు!

Attack

Attack

బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంకు శృంగభంగమైంది! అతని తాజా చిత్రం ‘అటాక్’ బాక్సాఫీస్ బరిలో అటాక్ చేయలేకపోయింది. పేట్రియాటిజం బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ సైంటిఫిక్ యాక్షన్ మూవీలో జాన్ అబ్రహంతో పాటు రకుల్ ప్రీత్ సింగ్, జాక్విలిన్ ఫెర్నాండేజ్, ప్రకాశ్ రాజ్, రజిత్ కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. లక్ష్య రాజ్ ఆనంద్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. సినిమా మేకింగ్ పరంగా ‘అటాక్’కు మంచి గుర్తింపే వచ్చినా ఓపెనింగ్ రోజు పెద్దంత బజ్ ను క్రియేట్ చేయడంలో విఫలమైంది. దాంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమా కేవలం రూ. 3.51 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి శని, ఆదివారాలలో ఏమైనా బెటర్ మెంట్ ఉంటుందేమో చూడాలి.

Read Also : Tiger Nageswara Rao : వేట మొదలైంది… స్టన్నింగ్ ప్రీ లుక్

ఇదిలా ఉంటే… ‘అటాక్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జాన్ అబ్రహం దక్షిణాది చిత్రాలపై ముఖ్యంగా తెలుగు సినిమాలపై తగదునమ్మా అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘సాలార్’ చిత్రంలో నటిస్తున్నారా? అని అడిగిన ఓ ప్రశ్నకు అవుననో, కాదనో సమాధానం చెప్పకుండా ‘నేను హిందీ నటుడిని, ఆ భాషా చిత్రాలే చేస్తాను. డబ్బుల కోసం కొందరి మాదిరి ప్రాంతీయ భాషా చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సెకండ్ హీరోగా నటించను’ అని అన్నాడు. జాన్ అబ్రహం ఈ మాటలు తన గురించే చెప్పినా, ప్రాంతీయ భాషా చిత్రాలలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్స్ అభిమానులను ఈ వ్యాఖ్యలు చాలా హర్ట్ చేశాయి. ఎందుకంటే అజయ్ దేవగన్ వంటి స్టార్ హీరో ‘ట్రిపుల్ ఆర్’లో కీలక పాత్ర పోషిస్తే, సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి వారు త్వరలో విడుదల కాబోతున్న ‘కేజీఎఫ్ చాప్టర్ 2’లో నటించారు. ఆ రకంగా ఉత్తరాదిలోని స్టార్స్ ఫ్యాన్స్ తో జాన్ అబ్రహం గొడవ పెట్టుకున్నట్టు అయ్యింది. అది ‘అటాక్’ మూవీ కలెక్షన్లపై ప్రభావం చూపించిందని చెప్పలేం కానీ, ‘ట్రిపుల్ ఆర్’ హంగామా ఇంకా ఉత్తరాదిన కొనసాగుతుండటంతో జనం ‘అటాక్’ను పట్టణాల్లోనే కాదు మెట్రో సిటీస్ లోనూ పట్టించుకోలేదని తెలుస్తోంది.

Exit mobile version