Site icon NTV Telugu

D52 : ధనుష్ సినిమా సెట్స్ లో అగ్ని ప్రమాదం

Idly Kadai

Idly Kadai

కోలీవుడ్ హీరో కమ్ దర్శకుడు ధనుష్  బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు కమిటవుతూ బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాలేకుండా చక్కర్లు కొట్టేస్తున్నాడు. ఓ వైపు యాక్టింగ్ మరో వైపు డైరెక్టింగ్ చేస్తూ టైమంతా సెట్స్‌లోనే గడిపేస్తున్నాడు. తెలుగులో హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర, బాలీవుడ్‌లో తేరీ ఇష్క్ మే చేస్తున్నాడు ఈ స్టార్ హీరో. ఇక తన స్వీయ దర్శకత్వంలో తమిళంలో ఇడ్లీ కడాయ్ అనే సినిమా చేస్తున్నాడు. నిత్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. రాయన్, నీక్ తర్వాత ధనుష్ నుండి రాబోతున్న డైరోక్టోరియల్ మూవీ ఇడ్లీ కడాయ్. ఈ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు ఎప్పుడో ఎనౌన్స్ చేశాడు ధనుష్.

Also Read : Thug Life : మరో నార్త్ బ్యూటీని సౌత్ కు పరిచయం చేస్తున్న మణిరత్నం

కానీ షూటింగ్ డిలే అవుతుండడంతో రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడు ధనుష్. లాంగ్ గ్యాప్ తర్వాత ఇటీవల ఇడ్లీ కడాయ్ షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేసాడు ధనుష్. అయితే షూటింగ్ కోసం వేసిన సెట్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందట. దాంతో ప్రత్యేకంగా నిర్మించిన కొన్ని భారీ సెట్స్ అగ్నికి ఆహుతయ్యాయని తెలుస్తోంది. యూనిట్ లో ఎవరికి ఏమి కాలేదని సమాచారం. కాగా ఏప్రిల్ లో వాయిందా వేసిన ఇడ్లీ కడాయ్ ఏకంగా ఆరు నెలల పాటు వాయిదా వేసాడు ధనుష్. ఈ సినిమాను 2025 అక్టోబరు 1 న రిలీజ్ చేయబోతున్నట్టు అధికారకంగా ప్రకటించిన ఈ సినిమాను డాన్ పిచర్స్, రెడ్ జేయింట్ మూవీస్, వండర్ బార్ ఫీల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Exit mobile version