NTV Telugu Site icon

Chiranjeevi: బ్రేకింగ్.. చిరంజీవి సినిమా సెట్ లో అగ్నిప్రమాదం

Chiru

Chiru

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమాలోని పాదఘట్టం సెట్ హైదరాబాద్ లోని కోకాపేటలో వేసిన సంగతి తెల్సిందే. సినిమా పూర్తి అయినా ఆ సెట్ ఇంకా తొలగించలేదు. ఇక తాజాగా ఆ సెట్ లో అగ్నిప్రమాదం జరిగింది.

Read Also: Off The Record: మైనంపల్లి రూటే సపరేటు

ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. హుటాహుటిన వారు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారని తెలుస్తోంది. అయితే అసలు ఈ మంటలు ఎలా చెలరేగాయి..? నిప్పు ఎక్కడ నుంచి వచ్చింది..? అనేది తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.

Show comments