Site icon NTV Telugu

మరోసారి చిక్కుల్లో శిల్పా, రాజ్ కుంద్రా… కేసు నమోదు

Raj-Kundra-and-Shilpa-Shett

Raj-Kundra-and-Shilpa-Shett

రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి కష్టాలు ఇప్పట్లో తీరేలా కన్పించడం లేదు. రోజుకో వివాదంలో కూరుకుపోతున్నారు ఈ జంట. శిల్పా శెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు తాజాగా మరో పెద్ద సమస్య వచ్చింది. 1.51 కోట్ల చీటింగ్ కేసులో వీరిద్దరూ నిందితులుగా ఉన్నారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ముంబై, బాంద్రా పోలీస్ స్టేషన్‌లో పూణె యువకుడు యష్ బరాయ్ ఈ జంట తనను మోసం చేశారంటూ కేసు నమోదు చేశారు. ఫ్యాషన్ టీవీ ఎండీ కషీఫ్ ఖాన్‌పై కూడా ఈ మేరకు పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. ఈ ఘటన జూలై 2014లో జరిగినట్లు తెలుస్తోంది.

Read Also : టికెట్ రేట్లపై కోర్టుకు ‘ఆర్ఆర్ఆర్’ టీం… అసలు విషయం ఇదే !

అసలు విషయంలోకి వెళ్తే… ఫిట్‌నెస్ స్కీమ్‌లో డబ్బు పెట్టుబడి పెట్టమని కాషీఫ్ ఖాన్, శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాతో పాటు పలువురు తనను అడిగారని, భారీ లాభాలు వస్తాయని ఆశ చూపారని సదరు యువకుడు ఈ ఫిర్యాదులో ఆరోపించారు. కానీ అందులో తనకు ఎలాంటి లాభాలు రాకపోవడంతో తన డబ్బు 1.51 కోట్లు ఇచ్చేయాలంటూ అడగ్గా, యష్ ని బెదిరించారట. దీంతో చేసేది లేక యష్ బరాయ్ పోలీసులను ఆశ్రయించాడు.

అశ్లీలత కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ అయినప్పటి నుండి శిల్పా కుటుంబం చట్టపరమైన సమస్యల్లో చిక్కుకుంటూనే ఉంది. రాజ్ కుంద్రా రెండు నెలల పాటు ఆర్థర్ రోడ్ జైలులో గడిపి, ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు. అలా బయటకు వచ్చాక మొదటిసారిగా శిల్పా, రాజ్ కుంద్రా కలిసి వెళ్లిన హిమాచల్ ప్రదేశ్ ట్రిప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన తర్వాత ఈ జంట బయట కలిసి కనిపించడం ఇదే తొలిసారి. కానీ ముంబైకి పిల్లలతో కలిసి శిల్పా మాత్రమే తిరిగి వచ్చింది.

Exit mobile version