Actor Yash: ఎట్టకేలకు ఆ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యశ్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Finally KGF Fame Yash Gives Green Signal To This Director For His Next Project: ‘కేజీఎఫ్ 2’ సినిమా వచ్చి ఏడాదికి పైనే అవుతున్నా.. హీరో యశ్ ఇంతవరకు తన తదుపరి సినిమాను ప్రకటించలేదు. కేజీఎఫ్ సిరీస్‌తో తనకొచ్చిన పాన్ ఇండియా స్టార్‌డమ్‌కి తగినట్టు భారీ సినిమా చేయాలన్న ఉద్దేశంతో.. అతడు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. సరైన స్ర్కిప్ట్, దాన్ని హ్యాండిల్ చేయగల దర్శకుడి కోసం వేచి చూస్తున్నాడు. మధ్యలో ఒకరిద్దరి దర్శకుల పేర్లు తెరమీదకి వచ్చాయి కానీ.. ఆ తర్వాత అవన్నీ రూమర్లేనని తేలిపోయాయి. దీంతో.. యశ్ తదుపరి సినిమా ఎవరితో ఉంటుంది? అనే సస్పెన్స్ మళ్లీ కొనసాగింది. అయితే.. ఇప్పుడు ఆ సస్పెన్స్‌కి దాదాపు తెరపడినట్టేనని తెలుస్తోంది. ఎందుకంటే.. ఇన్నాళ్లూ ఏ ఒక్కరికీ పచ్చజెండా ఊపకుండా కాలం వెళ్లదీసిన యశ్, ఇప్పుడు ఓ డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.
Nikhil SPY: అఫీషియల్.. నిఖిల్ డబుల్ ధమాకా.. ఆగమనం అప్పుడే!
Also Read
- Pradeep Ranganathan: ఆ డైరెక్టర్'తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
- Rao Bahadur: "మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!" రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
- Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
- Mirzapur The Movie : మిర్జాపూర్ : ది మూవీ’ టీజర్ విడుదల
ఇంతకీ, ఆ దర్శకుడు ఎవరా? అనేగా మీ సందేహం! మరెవ్వరో కాదు.. ‘మూతన్’ ఫేమ్ మోహన్ దాస్. ఈ ఇద్దరి మధ్య ఇప్పటికే కొన్నిసార్లు చర్చలు జరిగాయని.. మోహన్ దాస్ చెప్పిన స్టోరీ నచ్చడంతో యశ్ ఓకే చెప్పాడని కన్నడ సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కేజీఎఫ్ తరహాలోనే ఇది ఔట్ అండ్ ఔట్ యాక్షన్ త్రిల్లర్గా తెరకెక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా సాగుతున్నాయట! త్వరలోనే ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని, చాలా గ్రాండ్‌గా ఈ సినిమాను లాంచ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఓకే అయినట్టు ఇంకా ఎలాంటి సంకేతాలు లేకపోయినా, దాదాపు కన్ఫమ్ అయ్యిందని వాదనలు మాత్రం ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి. కాబట్టి.. ఏ క్షణంలోనేనైనా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రావొచ్చు.
Kavya Thapar Hot Photoshoot: కావ్య థాపర్ హాట్ ఫోటోషూట్.. పిక్స్ చూస్తే పిచ్చెక్కిపోవడం పక్కా!
తాజావార్తలు
-
T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
-
Homemade Paneer : ఇంట్లోనే సాఫ్ట్ పనీర్.. ఈ ట్రిక్ తెలిస్తే చాలు!
-
Early Pregnancy Diet: గర్భంతో ఉన్న వారు బొప్పాయి, పైనాపిల్ తినకూడదు ఎందుకు..? కారణం ఇదే..
-
Team India: 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ ప్రయాణం.. నాడు లార్డ్స్ మైదానంలో ఓటమి.. నేడు ప్రపంచ నంబర్ 1 స్థానం..
-
Specific Carbohydrate Diet for Gut Health: పేగుల సమస్యలకు డైట్ థెరపీ.. వైద్యులు ఏమంటున్నారు?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!