Nikhil SPY: అఫీషియల్.. నిఖిల్ డబుల్ ధమాకా.. ఆగమనం అప్పుడే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nikhil SPY Makers Gives Clarity On Release Date: విభిన్నమైన కథాచిత్రాలతో విరుస విజయాలు అందుకుంటూ దూసుకెళ్తున్న యువ హీరోల్లో నిఖిల్ సిద్ధార్థ ఒకరు. ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా హిట్ అందుకున్న ఈ యువనటుడు.. ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమా ‘స్పై’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నద్ధమవుతున్నాడు. ప్రస్తుతం శరవేగంగా ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా.. జూన్ 29వ తేదీన విడుదల అయ్యేందుకు ముస్తాబవుతోంది. ప్రొడక్షన్ పనుల వల్ల ఈ సినిమా ఆలస్యం కావొచ్చని తొలుత అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే.. అలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, షెడ్యూలో ప్రకారం జూన్ 29వ తేదీనే తమ సినిమాని రిలీజ్ చేస్తామని మేకర్స్ అఫీషియల్‌గా వెల్లడించారు.
MLA Mekapati Vikram Reddy: అభివృద్ధి చేసుంటే.. 2014 ఎన్నికల్లో ఎందుకు ఓడారు?
Also Read
ఇదే సమయంలో మరో క్రేజీ అప్డేట్ కూడా ఇచ్చారు స్పై మేకర్స్. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను జూన్ 20వ తేదీన విడుదల చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఇప్పటికే వచ్చిన టీజర్‌కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్‌లో ఒకరైన సుభాష్ చంద్రబోస్ డెస్ మిస్టరీ నేపథ్యంతో ఈ సినిమా కథ అల్లుకుని ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. ఈసారి ట్రైలర్‌లో మరింత సస్పెన్స్, యాక్షన్‌ను దట్టించి.. విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నారు. ఇది తప్పకుండా సినిమాపై అంచనాలు పెంచుతుందని చెప్తున్నారు. ట్యాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ గేరీ బీహెచ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను కే రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తుండగా.. ఆర్యన్ రాజేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ‘కార్తికేయ 2’ తరహాలోనే ఈ సినిమా కూడా వండర్స్ క్రియేట్ చేస్తుందని నిఖిల్ ఆశిస్తున్నాడు.

Spy 4
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!