Finally Ileana Dcruz Reveals Her Boyfriend Photo: రిలేషన్‌షిప్ విషయంలో బాలీవుడ్ వాళ్లు ఎంత ఫాస్ట్‌గా ఉంటారో అందరికీ తెలుసు. ఎప్పుడు ఎవరితో డేటింగ్ చేస్తారో, ఎవరిని పెళ్లి చేసుకుంటారో, ఎప్పుడు గర్భం దాలుస్తారో ఎవ్వరికీ తెలీదు. సడెన్‌గా ఆయా ప్రకటనలు చేసి, అందరినీ షాక్‌కి గురి చేస్తుంటారు. కొందరైతే.. పెళ్లి కాకముందే గర్భం దాల్చి, కళ్లు బైర్లు కమ్మే ట్విస్టులు ఇచ్చారు. అలాంటి వారిలో గోవా బ్యూటీ ఇలియాని డిక్రూజ్ ఒకరు. అరకొర సినిమాలు చేసుకుంటూ, సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో రచ్చ చేసే ఈ బ్యూటీ.. సడెన్‌గా ఓరోజు తాను గర్భం దాల్చానంటూ బాంబ్ పేల్చింది. దాంతో ఖంగుతిన్న నెటిజన్లు.. ఆమెను ట్రోల్ చేశారు. పెళ్లి చేసుకోకుండా తల్లి అయినందుకు.. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు ఆమెకు మద్దతుగా నిలిస్తే, మరికొందరేమో పెళ్లి కాకుండానే ఇదేం పాడు పని అంటూ తిట్టిపోశారు.
Prakruti Mishra: ఆఫర్ల పేరుతో ఆ నిర్మాత వాడుకున్నాడు.. ప్రేమమ్ నటి సంచలన వ్యాఖ్యలు
ఆ సంగతులు అలా ఉంచితే.. ఇలియానా తాజాగా తన బాయ్‌ఫ్రెండ్ ఎవరో రివీల్ చేసింది. ఇన్నాళ్లూ పెళ్లి కూతుర్ని దాచినట్టు తన బాయ్‌ఫ్రెండ్ వివరాల్ని గోప్యంగా ఉంచిన ఈ అమ్మడు, లేటెస్ట్‌గా అతనితో కలిసి దిగిన ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కాకపోతే.. అందులో కూడా అతడు క్లారిటీగా కనిపించడం లేదు. ఫోటో చాలా వరకు బ్లర్‌గా ఉంది. కేవలం అతని గడ్డం మాత్రమే ఆ ఫోటోలో హైలైట్ అవుతోంది. ఏదైతేనేం.. కనీసం ఈ ఫోటో పెట్టినందుకు, సంతోషమంటూ నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. ఇదే సమయంలో ఇలియానా తన ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘమైన పోస్టు కూడా పెట్టింది. ప్రెగ్నెన్సీ అనేది ఒక పెద్ద వరమని, తన జీవితంలో ఇలాంటి ఘట్టం వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని, ఇందుకు తనని తాను అదృష్టవంతురాలిగా భావిస్తున్నానని తెలిపింది. తన బేబీ బంప్ చూస్తుంటే చాలా ముద్దొస్తుందని చెప్పిన ఇలియానా.. లోపల ఓ బిడ్డ పెరుగుతుంటే, ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేనిదని చెప్పింది.
Devara: దేవరపై ఇంట్రెస్టింగ్ రూమర్.. ఆ హాలీవుడ్ సినిమాకు ఇన్స్‌పిరేషనా?
త్వరలోనే తాను తన బిడ్డని చూడబోతున్నామని, అది ఊహిస్తుంటేనే ఎంతో ఆనందంగా ఉందని ఇలియానా పేర్కొంది. తాను ఎలాంటి తల్లిని కాబోతున్నానన్నది తనకు ఏమాత్రం తెలియదని, కానీ భవిష్యతుల్లో రాబోయే బిడ్డని మాత్రం తనకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని, ప్రేమిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చింది. ఇక ఈ ప్రయాణంలో తన ప్రియమైన వ్యక్తి ఎంతో సహకరించాడని, తనకు సమస్యలు ఎదురైన ప్రతిసారి తన కన్నీళ్లు తుడిచాడని, రాయిలా తనకు అండగా నిలబడ్డాడని, ఇప్పుడు ఏదీ తనకు అంత కష్టంగా అనిపించడం లేదని ఆ పోస్టులో ఇలియానా వివరించింది.