NTV Telugu Site icon

Umair Sandhu: చిరంజీవిని అంకుల్ అన్న ప్రముఖ క్రిటిక్.. మెగా అభిమానుల ఫైర్

Umair Sandhu

Umair Sandhu

Umair Sandhu: ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉమైర్ సంధు సెంట్రల్ సెన్సార్ బోర్డులో సభ్యుడిగా పనిచేస్తున్నాడు. దీంతో దేశవ్యాప్తంగా ఏదైనా క్రేజీ మూవీ విడుదల అవుతుందంటే చాలు కొన్ని రోజుల ముందుగానే ఆ సినిమా గురించి సోషల్ మీడియాలో రివ్యూ పోస్ట్ చేస్తుంటాడు. అంతేకాకుండా వివాదాస్పద కామెంట్లు కూడా చేస్తాడు. దీంతో అతడికి, కొందరు హీరోల అభిమానులకు సోషల్ మీడియాలో చిన్నపాటి యుద్ధం జరుగుతూ ఉంటుంది. తాజాగా ఉమైర్ సంధు మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తూ ఓ కామెంట్ పెట్టాడు. చిరంజీవి అంకుల్ అంటూ ట్రోల్ చేశాడు. ‘చిరంజీవి అంకుల్, ఇంకా యంగ్‌గా కనిపించలానే ప్రయత్నాన్ని మానుకోండి. ఇప్పుడు మీ వయసు 70 ఏళ్లు అని గుర్తుంచుకోండి’ అంటూ ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు.

Read Also: Bigg Boss Adi Reddy: ఆది రెడ్డి ఇంత పారితోషికం తీసుకున్నాడా?

ఈ నేపథ్యంలో ఉమైర్ సంధుపై మెగా అభిమానులు మండిపడుతున్నారు. అతడు ఎప్పుడు చూసినా క్రేజ్ ఉన్న వ్యక్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి క్రేజ్ పొందాలని చూస్తుంటాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే చిల్లర కామెంట్స్ చేస్తే చిప్పకూడు తప్పదని మెగా ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ఉమైర్ సంధు పద్ధతి మార్చుకోకపోతే తాము వేరే విధంగా బుద్ధి చెప్తామని కామెంట్ చేస్తున్నారు. కాగా చిరంజీవిని ఉమైర్ సంధు టార్గెట్ చేయడం ఇదే తొలిసారి కాదు.‘గాడ్ ఫాదర్ సినిమా ఓ యావరేజ్ మూవీ అని… కొత్త సీసాలో పాత సారా అనేలా ఉందని విమర్శించాడు. చిరంజీవి దయచేసి రెస్ట్ తీసుకోవాలని.. ఇకనైనా మంచి కంటెంట్ ఉన్న స్క్రిప్ట్స్ సెలక్ట్ చేసుకోవాలని ఉమైర్ సంధు సూచించాడు.

Show comments