Koratala Siva: ‘దేవర’ అసలు ధీమ్ ఏంటంటే: కొరటాల శివ ఇంటర్వ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koratala Siva Interview for Devara Movie: కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం దేవర. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, మురళీ శర్మ, శ్రుతి మరాఠీ వంటి వాళ్లు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. సెప్టెంబరు 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో తాజాగా కొరటాల శివ మీడియాతో మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు మీకోసం
దేవర థీమ్ ఏమిటి?
“దేవర” సినిమాలో భయం అనే ఒక ఎమోషన్ క్యారీ అవుతుంటుంది. నిజానికి ప్రతి మనిషిలో భయం ఉండాలి, మనం ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయకపోవడానికి కారణం భయమే. అది బాధ్యతతో కూడిన భయం ఒకరకంగా ఆ భయాన్నే సినిమాలో మెయిన్ థీమ్ గా పెట్టుకున్నా.
Also Read
- Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం... 'రామాయణం' వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
- Mowgli : రోషన్ కనకాల కోసం బరిలోకి జూనియర్ ఎన్టీఆర్
- Srinidhi Shetty: రాగ పాత్రతో మరో ఫేస్ చూపించబోతోంది శ్రీనిధి.. ‘తెలుసు కదా’పై ఆసక్తికర కామెంట్స్!
- Saif Ali Khan : నాపై దాడి కొందరికి నాటకమైంది.. అసహనం వ్యక్తం చేసిన సైఫ్
అల్లు అర్జున్ తో మీది ఒక ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ పోస్టర్ వచ్చింది.. దానికి దేవరకు లింక్ ఉందా?
అల్లు అర్జున్ హీరోగా నా దర్శకత్వంలో ఒక సినిమా ఎనౌన్స్ చేసాం , అయితే ఆ ప్రాజెక్ట్ ను కారణాంతరాల వలన డ్రాప్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో దేవర కూడా సముద్రం బ్యాక్ డ్రాప్ తో ఉండేసరికి, ఇదే ఆ సినిమా అనుకుంటున్నారు కానీ ఆ ప్రాజెక్ట్ కి దేవరకు ఏమాత్రం సంబంధం లేదు.
ఎన్టీఆర్ నుంచి మీకు వచ్చిన ఎమోషనల్ సపోర్ట్?
నేను ఎన్టీఆర్ ని ఒక బ్రదర్ లా ట్రీట్ చేస్తా, అయన కూడా అదే స్థాయిలో నాతో బాండింగ్ షేర్ చేసుకుంటాడు. నేను ఏదైనా సీన్ చెప్తే బాగుంది అనిపిస్తే “అబ్బా అదిరిపోయింది” అని చెప్తాడు, ఒకవేళ నచ్చకపోతే కూడా అదే ఉచ్చ స్థాయిలో బాలేదని చెప్పేస్తాడు. ఎన్టీఆర్ అంత హానెస్ట్ గా ఉంటాడు కాబట్టే ప్రొడక్ట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ ఉండదు.
దేవర ముందే రెండు భాగాలు అనుకున్నారా?
దేవర కథ కావాలని రెండు భాగాలుగా విడదీయలేదు. నేను కథ రాసుకున్నప్పుడు 6 గంటల నిడివి వచ్చింది. అయినా కూడా వద్దులే ఒక పార్ట్ గానే రిలీజ్ చేద్దామని షూటింగ్ స్టార్ట్ చేశాం. కానీ.. షూటింగ్ చేస్తున్నప్పుడు అవుట్ పుట్ చూసుకుని ఈ సినిమాని ఒక్క పార్ట్ గా రిలీజ్ చేయడం కష్టం అని నేను, తారక్ డిసైడ్ అయ్యి తర్వాత రెండు భాగాలుగా విడుదల చేద్దామని ఆ మేరకు పనులు మొదలెట్టాము.
పార్ట్ 2 ఎప్పుడు ఉంటుంది?
పార్ట్ 2 షూటింగ్ కి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే.. ఎన్టీఆర్ ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యారు, అవన్నీ పూర్తయ్యాక పార్ట్ 2 పనులు మొదలు పెడతాం. ఈ సినిమాకి మూడో పార్ట్ తీసే ఆలోచన ఏ మాత్రం లేదు. రెండు భాగాలతోనే ముగిస్తాం.
ఆచార్య వలన ఒత్తిడి ఫీల్ అయ్యారా?
ఆచార్య రిజల్ట్ విషయంలో కాస్త బాధ పడిన విషయం వాస్తవమే కానీ, ఆ రిజల్ట్ నా మీద ఎఫెక్ట్ చూపించే స్థాయి గ్యాప్ నేను తీసుకోలేదు. “ఆచార్య” విడుదలైన 20 రోజులకు “దేవర” మోషన్ రిలీజ్ చేశాం. ఆ వెంటనే వర్క్ మొదలుపెట్టాం. అందువల్ల ఆ రిజల్ట్ ను కానీ, రిజల్ట్ ఎఫెక్ట్ ను కానీ నేను తర్వాత పట్టించుకోవాల్సిన పని పడలేదు.
చిరంజీవి గారికి మీకు పొరపొచ్చాలు వచ్చాయనే మాట ఎంతవరకు నిజం?
మీడియాలో చిరంజీవి గారికి నాకు మధ్య పొరపచ్చాలు వచ్చాయి అని చాలా కథనాలు వచ్చాయి కానీ.. నిజానికి మా ఇద్దరి మధ్య సఖ్యత బాగానే ఉంది. “ఆచార్య” రిలీజ్ తర్వాత రిజల్ట్ డిక్లేర్ అయ్యాక నాకు మొదట మెసేజ్ చేసిన వ్యక్తి చిరంజీవి గారే. “యు విల్ బౌన్స్ బ్యాక్ స్ట్రాంగర్ శివ” అని ఆయన పంపిన మెసేజ్ ను నేను ఎప్పడు మర్చిపోను. అందువల్ల ఆయనతో నాకు మనస్పర్థలు ఉన్నాయనే వదంతుల్ని నేను పట్టించుకోను.
ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం అవడం బాధించిందా?
“దేవర” ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం చాలా బాధ కలిగించింది. ఎందుకంటే.. మేము ఆడియన్స్ తో మాట్లాడే ఏకైక సందర్భం అది. అందరం స్పీచులు ప్రిపేర్ అయ్యాం. ఎవరి గురించి మర్చిపోకుండా మాట్లాడాలి అని ఒకటికి పదిసార్లు పేర్లు క్రాస్ చేసుకొని రెడీ అయ్యాక ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం బాధాకరం. దానికి ఎవరు కారణం అని నన్ను అడిగితే నేనేం చెప్పలేను.
సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివ్ ట్రోలింగ్ గురించి మీరేమంటారు?
నేను ట్విట్టర్ కి దూరమవడానికి కారణం మితిమీరిన నెగిటివిటీ. నేను సరదాగా నా సినిమా గురించి ఏమైనా పంచుకుందాం అనుకొని ట్విట్టర్ లో చేరాను. కానీ అక్కడ పాజిటివ్ మైండ్ అనేది నాకు కనిపించలేదు. మీమ్స్ వేసుకోవచ్చు, జోకులు వేసుకోవచ్చు కానీ హేట్రెడ్ అనేది మంచిది కాదు.
ప్రమోషనల్ కంటెంట్ ఫీడ్ బ్యాక్ గురించి మీ స్పందన?
సినిమా ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ అయ్యాక వచ్చిన ఫీడ్ బ్యాక్ ను తప్పకుండా తీసుకుంటాను. గ్రాఫిక్స్ విషయంలో మొన్నటి వరకు బెటర్ మెంట్ కోసం చెక్కుతూనే ఉన్నాం. ముఖ్యంగా షార్క్ ఫిష్ ఎపిసోడ్ & సీజీ వర్క్ విషయంలో చాలా నిక్కచ్చిగా వ్యవహరించాం.
దేవి శ్రీ ప్రసాద్ తో మీ కాంబో మళ్ళీ రిపీట్ అవుతుందా?
నేను వరుసబెట్టి దేవిశ్రీప్రసాద్ తో వర్క్ చేసాక, నేను మరీ కంఫర్ట్ జోన్ లో ఉండిపోతున్నానేమో అనిపించింది. అందుకే దేవికి చెప్పాను “కొంచెం గ్యాప్ తీసుకొని మళ్లీ కలిసి వర్క్ చేద్దామని”. తర్వాత “ఆచార్య” కోసం మణిశర్మ, ‘దేవర” కోసం అనిరుధ్ తో వర్క్ చేసాను. కచ్చితంగా నెక్స్ట్ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ తో వర్క్ చేస్తాను.
తాజావార్తలు
-
Smart Ration Cards : గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Toxic Trailer: ‘‘టాక్సిక్’’ ట్రైలర్.. ఒక్క దెబ్బతో అంతా మార్చేశారు!
-
Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
-
Snake Bite Treatment in 108 ambulance: పాముకాటుకు అంబులెన్స్‌లోనే చికిత్స.. 108 వాహనాల్లో తొలిసారి ఇంజక్షన్లు
ట్రెండింగ్
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్‌ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!