Dulquer : తెలుగు ప్రేక్షకుల ప్రేమ చూసి ఆశ్చర్యపోయా.. అదే కొత్తగా అనిపించింది: దుల్కర్ సల్మాన్ ఇంటర్వ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మహానటి’, ‘సీతా రామం’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దుల్కర్, ‘లక్కీ భాస్కర్’తో హ్యాట్రిక్ విజయాన్ని సాధించి, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ‘లక్కీ భాస్కర్’ చిత్రాన్ని నిర్మించారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక కాగా జివి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా థియేటర్లలో విడుదలైన ‘లక్కీ భాస్కర్’, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన కథానాయకుడు దుల్కర్ సల్మాన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
లక్కీ భాస్కర్ సినిమా ఒప్పుకోవడానికి కారణం ఏమిటి?
వెంకీ కథ చెబుతున్నప్పుడు, ఫస్ట్ హాఫ్ వినగానే ఈ సినిమా కచ్చితంగా చేయాలనుకున్నాను. బ్యాంకింగ్ నేపథ్యాన్ని తీసుకొని మధ్యతరగతి కుటుంబ కథ చెప్పడం కొత్తగా అనిపించింది. నేను ఎప్పటినుంచో వాస్తవానికి దగ్గరగా ఉండే ఒక మధ్యతరగతి తండ్రి పాత్ర చేయాలనుకుంటున్నాను. అది ఈ సినిమాతో నెరవేరింది, నా దృష్టిలో ఇది వాస్తవ కథ. బ్యాక్ గ్రౌండ్ లో హర్షద్ మెహతా లాంటివాడు భారీ స్కాం చేస్తుంటే, ఒక చిన్న బ్యాంక్ ఉద్యోగి తన పరిధిలో స్కాం చేయడం అనేది కొత్త పాయింట్. ఇది బ్యాంకింగ్ నేపథ్యమున్న సినిమా కావడంతో వెంకీ ఎంతో రీసెర్చ్ చేశాడు. బ్యాంకింగ్ సెక్టార్ కి చెందినవారు కూడా ఇందులో ఎటువంటి తప్పులు లేవని చెప్పడం విశేషం.
Also Read
- Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం... 'రామాయణం' వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
- Mowgli : రోషన్ కనకాల కోసం బరిలోకి జూనియర్ ఎన్టీఆర్
- Srinidhi Shetty: రాగ పాత్రతో మరో ఫేస్ చూపించబోతోంది శ్రీనిధి.. ‘తెలుసు కదా’పై ఆసక్తికర కామెంట్స్!
- Saif Ali Khan : నాపై దాడి కొందరికి నాటకమైంది.. అసహనం వ్యక్తం చేసిన సైఫ్
లక్కీ భాస్కర్ పాత్రలో గ్రే షేడ్స్ ఉన్నాయి కదా.. ఎలాంటి వర్క్ చేశారు?
ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలి. షారుఖ్ ఖాన్ లాంటి వారు కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశారు. మనలోని నటుడిని బయటకు తీసుకురావాలంటే ఇలాంటి విభిన్న పాత్రలు చేయాలి. భాస్కర్ పాత్రలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. నటుడిగా ఇలాంటి పాత్రలు సంతృప్తిని ఇస్తాయి.
షూటింగ్ లో ఏమైనా ఛాలెంజ్ లు ఎదురయ్యాయా?
ఛాలెంజింగ్ గా అనిపించలేదు. ప్రతి రోజూ, ప్రతి సీన్ చేయడాన్ని ఆస్వాదించాను. ప్రతి దశలో ఎంజాయ్ చేశా, ఈ సినిమా ఎంతో సంతృప్తిని ఇచ్చింది.
తెలుగులో హ్యాట్రిక్ విజయాలు సాధించడం ఎలా ఉంది?
ప్లాన్ చేస్తే విజయాలు రావు. అందరూ మంచి కథలు చెప్పాలి, మంచి సినిమాలు చేయాలని అనుకుంటాం. అలాగే ముందుకు వెళ్తున్నా,. కష్టానికి తగ్గ ఫలితం దక్కడం సంతోషంగా ఉంది.
బ్యాంకింగ్ సబ్జెక్టు అంటే సామాన్యులకు అర్థమవుతుందా లేదా అనే సందేహం కలగలేదా?
ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్ అనేది దాదాపు అందరికీ ఉంటుంది. పైగా ఇందులో భాస్కర్ సైడ్ బిజినెస్ లా.. చదువురాని వారికి ఫామ్ నింపడం లాంటివి చేస్తుంటాడు. అలాంటి సన్నివేశాలు చాలా మందికి కనెక్ట్ అవుతాయి. ఈ సినిమా అందరికీ అర్థమయ్యేలా వెంకీ చాలా బాగా తీశారు.
సినిమాలో చూపించినట్టు మిడిల్ క్లాస్ వారికి లాటరీ అనేది డ్రీమ్.. మీరు నిజ జీవితంలో లాటరీ టికెట్ కొన్నారా?
మమ్ముట్టి గారి కొడుకు అయినప్పటికీ, నేను సాధారణ యువకుల్లాగానే ఆలోచిస్తా, యువకుడిగా ఉన్నప్పుడు లాటరీ తగిలితే, సొంతంగా నాకు నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు అని కలలు కనేవాడిని.
లక్కీ భాస్కర్ సినిమా చూసి మీ తండ్రి మమ్ముట్టి గారి స్పందన ఏంటి? ఆయనకి, మీకు మధ్య సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతాయా?
నాతో ఏం చెప్పలేదు. కానీ, దర్శకుడు వెంకీతో మాట్లాడి ప్రత్యేకంగా అభినందించారు. ఏదైనా కొత్త కథ విని నచ్చితే, ఇద్దరం దాని గురించి మాట్లాడుకుంటాం. నాకు బాగా నచ్చిన కథల గురించి ఆయనకు చెబుతుంటాను. మమ్ముట్టి పలు తెలుగు సినిమాలలో నటించారు. నేను తెలుగు సినిమా చేసే ముందు, ఆయనకు చెప్తే.. బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అని చెప్పారు.
జి.వి. ప్రకాష్ సంగీతం గురించి?
కథకి తగ్గట్టుగా, ప్రతి ఎమోషన్ ని ప్రేక్షకులు ఫీలయ్యేలా అద్భుతమైన సంగీతం అందించారు.
తెలుగు ప్రేక్షకుల గురించి?
తెలుగు ప్రేక్షకుల ప్రేమ చూసి మొదట నేను ఆశ్చర్యపోయాను. మహానటికి ముందు మలయాళ ప్రేక్షకులకు, కొంతవరకు తమిళ ప్రేక్షకులకు తెలుసు. మహానటి నుంచి తెలుగు ప్రేక్షకులు ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. సీతారామం చేయడానికి ఎక్కువ గ్యాప్ తీసుకున్నప్పటికీ, ఆ ప్రేమ పెరిగింది తప్ప తగ్గలేదు.
బాలకృష్ణ గారి అన్ స్టాపబుల్ షోలో పాల్గొనడం ఎలా ఉంది?
బాలకృష్ణ గారు నిజంగా అన్ స్టాపబుల్. ఆయన ఎనర్జీ మ్యాచ్ చేయడం కష్టం. బాలకృష్ణ ఆరోజు 12 గంటలకు పైగా షూటింగ్ లో పాల్గొన్నారు. అయినప్పటికీ చివరి వరకు అదే ఎనర్జీతో ఉన్నారు.
మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్?
మీడియా నుంచే వచ్చింది. సినిమా గురించి, నా నటన గురించి పాజిటివ్ రివ్యూలు రావడం సంతోషం కలిగించింది.
మీ డ్రీమ్ రోల్ ఏంటి? మీ రాబోయే సినిమాలు?
అలా అని ఏమీ లేదు. అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. తెలుగులో ‘ఆకాశంలో ఒక తార’ సినిమా చేస్తున్నాను. అది కూడా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!