Site icon NTV Telugu

Tollywood: సీఎం ను కలిసిన సినీ ప్రముఖులు..

Dil

Dil

Tollywood: నూతన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కెఎల్ దామోదర ప్రసాద్, కౌన్సిల్ సెక్రెటరీ వైవీఎస్ చౌదరి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారాయణ, సెక్రటరీ కె.అనుపమ రెడ్డి, ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, సెక్రెటరీ టీఎస్ఎన్ దొర, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ పీవీ రవి కిషోర్, ట్రెజరర్ బాపినీడు, సుప్రియ తదితరులు.. ఆయనను కలిసి పుష్ప గుచ్ఛాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి, చిత్ర పరిశ్రమ డెవలప్ మెంట్ గురించి సుదీర్ఘ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అందరి మాటలను శ్రద్దగా విన్న రేవంత్ రెడ్డి.. కచ్చితంగా చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు కృషి చేస్తామని తెలిపినట్లు సమాచారం.

Exit mobile version