టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న కోట ఈ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కోటా శ్రీనివాసరావు దాదాపు 750కు పైగా సినిమాల్లో నటించారు. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. కోట శ్రీనివాసరావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులుతో పాటు రాజకీయ నాయకులు తమ సంతాపాన్ని తెలిజేశారు. కోట గురించి ఎవరెవరు
ఏపీ సీఎం నారాచంద్రబాబు నాయుడు : వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు గారి మరణం విచారకరం. సుమారు నాలుగు దశాబ్దాల పాటు సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన కళా సేవ, ఆయన పోషించిన పాత్రలు చిరస్మరణీయం. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన పోషించిన ఎన్నో మధురమైన పాత్రలు తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరనిలోటు. 1999లో విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ప్రజాసేవ చేశారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
బ్రహ్మానందం : కోట మహా నటుడు. రోజుకు 18 గంటలు పని చేసే వాళ్ళం. అరే ఒరే అని పిలుచుకునే వాళ్ళం. కోట లేరంటే నమ్మలేకుండా ఉన్న. నటన ఉన్నత కాలం కోట ఉంటారు
రాజేంద్ర ప్రసాద్ : అహనా పెళ్ళంట సినిమా చూడని తెలుగు వారు వుంటారని నేను అనుకోను. నా సినిమా సూపర్ హిట్స్ లో కోట మామ వున్నారుతెలుగు సినిమాలో కోట మామ గారు ప్రత్యేకం. ఆయన మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నారు. రాజకీయాల్లో కూడా కోట వున్నారుకోట మామ ఎక్కడున్నా స్వర్గంలో కూడా మీరు అలాగే వుండాలి.
తనికెళ్ళ భరణి : గొప్ప విలక్షణ నటుడుని కోల్పోయాము. కోట వందల వేల అనుభూతులను ఇచ్చాడు. కమిట్మెంట్ విషయంలో కోట కాంప్రమైజ్ అయ్యేవారు కాదు. నాటకాలు వేస్తున్న సమయం నుండి కోట నాకు పరిచయం. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. రాజకీయంగాను సినీ రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకన్నారు. ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. సినీ ఇండస్ట్రీ లో ఆయన పాత్రను ఎవరు రీప్లేస్ చేయలేరు. కోట లేరన్న వార్త నన్ను ఎంతగానో బాధించింది. దేవుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించాలి ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని అందించాలి.
మంచు విష్ణు : శ్రీ కోట శ్రీనివాస్ గారిని కోల్పోవడం ఎంతో బాధించింది. అద్భుతమైన నటుడు, అసమాన ప్రతిభ. అది సీరియస్ పాత్ర అయినా, విలన్ అయినా, కామెడీ అయినా – ప్రతి పాత్రలోనూ ఆయన ప్రాణం పోశారు, అరుదైన నైపుణ్యం కొంతమందికే దక్కుతుంది. ఆయనతో చాలా సినిమాల్లో పనిచేసే అదృష్టం నాకు కలిగింది, ఇంకా చాలా సినిమాల్లో ఆయనను చూస్తూ పెరిగాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. మనం ఆయనను శారీరకంగా కోల్పోయి ఉండవచ్చు, కానీ ఆయన కళ, ఆయన నవ్వు, ఆయన ఆత్మ ఆయన అలంకరించిన ప్రతి సన్నివేశంలో నిలిచి ఉంటాయి.
రామజోగయ్య శాస్త్రి : సద్గతి ప్రాప్తిరస్తు. కోట శ్రీనివాసరావు గారి మృతి తెలుగు సినిమా పరిశ్రమకు చాలా విచారకరమైన రోజు. కోట గారు ఎప్పటికి మన అందరి హృదయాల్లో నిలిచి ఉంటారు. మనం ఒక రత్నాన్ని కోల్పోయాము.
రవితేజ : ఆయనను చూస్తూ, ఆయన ప్రతి పాత్ర నుండి ఎంతో నేర్చుకుంటూ పెరిగాను. కోట బాబాయ్ నాకు కుటుంబం లాంటివాడు, ఆయనతో కలిసి పనిచేసిన మధురమైన జ్ఞాపకాలను ఎప్పటికీ ఓ జ్ఞాపకంగా నాతోనే ఉంటాయి. ఓం శాంతి.