NTV Telugu Site icon

MA 2 : అసిస్టెంట్ డైరెక్టర్ కు నయన్ మధ్య గొడవ.. సినిమా క్యాన్సిల్..?

Anushkashetty

Anushkashetty

నయనతార ప్రధాన పాత్రలో దర్శకుడు సుంద ర్.సి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మూకుతి అమ్మన్ 2’ (అమ్మోరు తల్లి 2). ఇటీవల ఈ సినిమా   ఓపెంనింగ్ కార్యక్రమాలను గ్రాండ్ గా నిర్వహించారు. తన సినిమాల పూజ కార్యక్రమాలకు ఎప్పడూ రాని నయనతార ఈ ‘మూకుతి అమ్మన్ 2′ ప్రారంభోత్సవానికి హాజరైంది. నయన్ లీడ్ రోల్ లో ఆర్ జే బాలాజీ దర్శకత్వంలో 2020లో విడుదలై ఘనవిజయం సాధించిన మూకుతి అమ్మన్ (అమ్మోరు తల్లి) కు సీక్వెల్ గా వస్తుంది మూకుతి అమ్మన్ 2’.

Also Read : Mohan Lal : L2 ఎంపురాన్ అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ టైమ్ రికార్డ్

అయితే మూకుతి అమ్మన్ 2′ షూటింగ్ ప్రారంభించిన కొన్ని రోజులకే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ సినిమాకు పని చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ కు హీరోయిన్ నయనతారకు మధ్య విభేదాలు తలెట్టాయట. ఆ గొడవలు తీవ్ర రూపం దాల్చి ఒక దశలో కోపాన్ని అణుచుకోలేక నయనతార సదరు అసిస్టెంట్ డైరెక్టర్ ను చెడ, మడ తిట్టేసిందట. దీంతో ఈ సమస్య సద్దుమణిగే వరకూ షూటింగ్ ఆపేయాలని దర్శకుడు సుందర్ సి భావించాడట. ఇటివంటి పరిస్థితుల్లో ఇక నయనతారతో పని చేయడం కష్టమనీ, ఆమె తమ మాట వినట్లేదని సినిమా నుండి నాయన తారను తొలగించి ఆమెకు బదులుగా తమన్నాను తీసుకుంటే బాగుంటుందేమో అనే ఆలోచన కూడా చేసాడట దర్శకుడు సుందర్ సి. అయితే చిత్ర నిర్మాత ఇషారి.కె.గణేశ్ జోక్యం చేసుకోవడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయనీ షూట్ కూడా తిరిగి ప్రారం భమైందని తాజా సమాచారం. ఈ సినిమా కోసం నయనతార నాన్ వెజ్ కూడా మానేసి భక్తి శ్రద్ధలతో పాత్రను పోషిస్తుండడం గమనార్హం. అయితే ఈ వార్తలు అన్ని వట్టి పుకార్లే షూటింగ్ సజావుగా సాగుతుంది. మరో బ్లాక్ బస్టర్ సినిమా సుందర్ నుండి రాబోతుంది రిలాక్స్ గా ఉండండి అని దర్శకుడు సుందర్ సి భార్య కుష్బూ సుందర్ ఎక్స్ లో పోస్ట్ చేయడం కొసమెరుపు.