Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie News Fifty Years For Jawani Diwani Movie

Randhir Kapoor : యాభై ఏళ్ళ ‘జవానీ – దివానీ’

Published Date :July 14, 2022 , 7:00 am
By Subbarao N
Randhir Kapoor : యాభై ఏళ్ళ ‘జవానీ – దివానీ’
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రఖ్యాత నటదర్శకనిర్మాత రాజ్ కపూర్ తొలి నటవారసుడు రణధీర్ కపూర్. 1970లలో రణధీర్ కపూర్ హీరోగా నటించిన కొన్ని చిత్రాలు జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. ఆ కోవకు చెందిన చిత్రం ‘జవానీ – దివానీ’. ఈ చిత్రంలో నాయికగా జయబాధురి నటించారు. తరువాతి రోజుల్లో జయబాధురి, తన బోయ్ ఫ్రెండ్ అమితాబ్ బచ్చన్ ను వివాహమాడారు. ఆ పై రాజ్ కపూర్, అమితాబ్ బచ్చన్ కుటుంబాల మధ్య బంధుత్వం కూడా కుదిరింది. అందువల్ల రణధీర్ కపూర్, జయబాధురి జంటగా నటించిన ‘జవానీ – దివానీ’ చిత్రం ఇప్పటికీ ఆ రెండు కుటుంబాలకు ఓ ప్రత్యేకం! 1972 జూలై 14న విడుదలైన ‘జవానీ – దివానీ’ అప్పట్లో యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఆ యేడాది టాప్ టెన్ హిందీ మూవీస్ లో ఎనిమిదో స్థానం సంపాదించిందీ చిత్రం.

ఇంతకూ ‘జవానీ – దివానీ’ కథ ఏమిటంటే – ఓ ఠాకుర్ దగ్గర రవి ఆనంద్ పనిచేస్తుంటాడు. ఠాకుర్ చెల్లెలు మధు, రవిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. అప్పటి నుంచీ చెల్లెలుతో బంధం తెంచేసుకుంటాడు ఠాకుర్. రవికి విజయ్ ఆనంద్ అనే తమ్ముడు ఉంటాడు. అతను కాలేజ్ లో చదువుతూ నీతా ఠాకుర్ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. చిత్రంగా ఆ నీతా, ఠాకుర్ కూతురు. నీతాను తన మిత్రుని తనయుడు బెన్నీ సిన్హాకు ఇచ్చి పెళ్ళి చేయాలని నిశ్చయించి ఉంటాడు ఠాకుర్. అందుకు నీతా అంగీకరించదు. తాను విజయ్ ను ప్రేమించానని చెబుతుంది. వివరాలు తెలిసిన తరువాత ఠాకుర్ ససేమిరా అంటాడు. పైగా కాలేజ్ లో తన పలుకుబడి ఉపయోగించి, ఓ పథకం ప్రకారం విజయ్ ని గెంటేయించాలని చూస్తాడు ఠాకుర్. దాంతో విజయ్ మిత్రులు అందరూ కలసి కాలేజ్ లో క్లాసులు బహిష్కరిస్తారు. విజయ్ పై వచ్చిన అభియోగం నిజం కాదని, అతడు నీతాను ప్రేమిస్తున్నాడని విద్యార్థులు అంటారు. అదే సమయానికి తండ్రిని ఎదిరించి, నీతా కూడా వచ్చి విజయ్ చెంతన చేరుతుంది. ఇది చూసిన కాలేజ్ ప్రిన్సిపల్, తాను విజయ్, నీతాతో మాట్లాడతానని, మిగిలినవారు క్లాసులకు వెళ్ళాలని చెబుతాడు. తమ్ముడు విజయ్ కాలేజ్ గొడవ తెలుసుకున్న అన్న రవి అక్కడకు వస్తాడు. అదే సమయానికి నీతా తండ్రి ఠాకుర్ కూడా అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఇక నీతా తనకు దక్కదని తెలుసుకున్న బెన్నీ తన గూండాలతో కాలేజ్ స్టూడెంట్స్ పై బాంబులు వేయిస్తాడు. ఆ సమయంలో ఠాకుర్ పై బాంబు పడబోతూండగా, అతడిని రక్షించి, తాను ప్రమాదానికి గురవుతాడు రవి. బెన్నీకి బడితపూజ చేస్తాడు విజయ్. బెన్నీని పోలీసులు పట్టుకుపోతారు. ఆసుపత్రిలో రవిని ఎలాగైనా రక్షించమని ఠాకుర్ డాక్టర్ ను కోరతాడు. అక్కడ అతడిని చూసిన ఠాకుర్ చెల్లెలు మధు అతనే అలా చేయించాడని తూలనాడుతుంది. డాక్టర్ ప్రమాదం లేదని, వెళ్ళి చూడవచ్చునని చెబుతాడు. ఠాకుర్ తన తప్పు తెలుసుకొని విజయ్, నీతాను కలుపుతాడు. అతని చెల్లెలు మధు, రవి కూడా ఆనందిస్తారు. అలా కథ సుఖాంతమవుతుంది.

ఇందులో రవి ఆనంద్ గా బలరాజ్ సహానీ, ఆయన భార్య మధుగా నిరూపరాయ్, ఠాకుర్ గా ఇఫ్తేకార్ నటించారు. మిగిలిన పాత్రల్లో ఎ.కె.హంగల్, నరేంద్రనాథ్, పైంటాల్, సత్యేంద్ర కపూర్, జగ్దిష్ రాజ్, విజు ఖోటే కనిపించారు. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత ఇందర్ రాజ్ ఆనంద్ తో కలసి తరువాతి రోజుల్లో నటరచయితగా సుప్రసిద్ధుడైన ఖాదర్ ఖాన్ రచన చేశారు. ఖాదర్ ఖాన్ కు ఇదే రచయితగా తొలి చిత్రం కావడం విశేషం! ఇక ‘గుడ్డి’లో ముద్దుగా మురిపించిన జయబాధురి, ఈ సినిమాతోనే గ్లామర్ గానూ కనిపించి అలరించారు. రమేశ్ బెహల్ నిర్మించిన ఈ చిత్రానికి నరేందర్ బేడీ దర్శకత్వం వహించారు. నరేందర్ బేడీకి దర్శకునిగా ఇది రెండో సినిమా. అంతకు ముందు రాజేశ్ ఖన్నాతో బేడీ తెరకెక్కించిన ‘బంధన్’ అలరించింది. ఆ తరువాత “దిల్ దీవానా, ఖోటే సిక్కే, బేనామ్, రఫూ చక్కర్, మహా చోర్, అదాలత్, కచ్చే హీరో, సనమ్ తేరీ కసమ్, ఆఖరీ సంఘర్ష్” వంటి చిత్రాలను ఆయన రూపొందించారు.

‘జవానీ – దివానీ’ విజయానికి అసలు కారకులు సంగీత దర్శకుడు ఆర్.డి. బర్మన్ అనే చెప్పాలి. అప్పట్లో యువతను కిర్రెక్కిస్తూ ఆయన స్వరపరచిన పాటలు జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. ‘జవానీ – దివానీ’ కోసం ఆనంద్ బక్షీ రాసిన పాటలకు ఆర్డీ బాణీలు భలేగా జోడీ కుదిరాయి. ఇందులోని “సామ్నే ఏ కౌన్ ఆయా…”, “యే జావనీ హై దివానీ…”, “జానే జా డూండ్తా ఫిర్ రహా హూ…” , “అగర్ సాజ్ ఛేడా…”, “నహి నహి… అభి నహి…”, “హే తౌబా…” అంటూ సాగే పాటలు అప్పట్లో యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలోని “యే జవానీ హై దివానీ…” పాట ఆ రోజుల్లో ఎంతోమంది గళాల్లో చిందులు వేసింది. అదే టైటిల్ గా రణధీర్ కపూర్ తమ్ముడు రిషి కపూర్ తనయడు రణబీర్ హీరోగా సినిమా రూపొంది ఘనవిజయం సాధించడం విశేషం!

‘జవానీ- దివానీ’కి కాసిన్ని మార్పులూ చేర్పులూ చేసి ‘మంత్రిగారి వియ్యంకుడు’ రూపొందింది. ఇక ‘జవానీ- దివానీ’ కథతోనే 19 ఏళ్ళ తరువాత కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా ‘అరళిద హువుగళు’ అనే సినిమా తెరకెక్కింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Balraj Sahni
  • Jawani Diwani
  • Jaya Bhaduri
  • Nirupa Roy
  • R. D. Burman.

తాజావార్తలు

  • Keesara BMW Accident Twist: కీసర BMW ప్రమాదం కేసులో ట్విస్ట్..! అసలు కారణం అదేనా..?

  • Vijay: డీలిమిటేషన్‌తో తమిళనాడుకు నష్టం.. పక్షపాత చర్య వద్దని విజయ్ హితవు

  • Virat Kohli: కోహ్లీ నా మజాకా.. బాబర్ ఆజామ్‌కు ఇచ్చిపడేసిన కింగ్ కోహ్లీ.. బిగ్ రికార్డుతో స్ట్రాంగ్ కౌంటర్!!

  • Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్‌ కొట్టివేసిన కోర్టు..

  • Moinabad Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి ప్రముఖ వ్యక్తి పేరు..

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions