రెబల్ స్టార్ బర్త్ డే కానుకగా వచ్చిన మూడు సినిమాలలో ఏ సినిమా అప్డేట్ ఫ్యాన్స్ ను అలరించారంటే..
ఫౌజీ : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫౌజీ. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా.. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. మన చరిత్రలో దాగి ఉన్న అధ్యాయాల నుండి ఒక సైనికుడి ధైర్య కథను ఫౌజీలో చూపిస్తామని దర్శకుడు హను రాఘవపూడి చెప్పారు. అయితే ఈ సినిమా పోస్టర్ పట్ల ఎన్నో అంచనాలు పెట్టుకున్న రెబల్ ఫ్యాన్స్ ను కాస్త డిజప్పోయింట్ చేసారు మేకర్స్. ప్రభాస్ ఫోటోతో వదిలిన టైటిల్ పోస్టర్ సో సో గా అనిపించింది.
Also Read : Kannada Beautys : టాలీవుడ్ సీనియర్ హీరోలతో కన్నడ కస్తూరీలు
రాజాసాబ్ : డార్లింగ్ బర్త్ డేకు రాజాసాబ్ నుంచి కూడా మేకర్స్ ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. “హ్యాపీ బర్త్‌డే రేబల్ సాబ్” అంటూ శుభాకాంక్షలు తెలుపుతూ, త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ పాటను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ పోస్టర్‌లో వింటేజ్ వైబ్‌తో అదిరిపోయాడు డార్లింగ్. అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను ఖుషి చేసింది రాజాసాబ్ టీమ్.
స్పిరిట్ : ఇక రెబల్ ఫ్యాన్స్ మోస్ట్ అవైటేడ్ అప్టేడ్ స్పిరిట్ కోసం వెయిట్ చేసిన ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా. రాత్రి 11 గంటలకు ‘సౌండ్ స్టోరీ’ పేరుతో నిమిషంన్నర ఆడియో గ్లింప్స్ రిలీజ్ చేశాడు. ఈ ఆడియో గ్లిమ్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. కేవలం ఆడియో రూపంలో వచ్చిన ఈ వీడియోలో ‘స్పిరిట్’లో ప్రభాస్ పాత్రను ఎలివేట్ చేసిన తీరు ఆకట్టుకుంది.
రెబల్ స్టార్ సినిమాలు నుండి వచ్చిన మూడు అప్డేట్స్ లో స్పిరిట్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇవ్వగా.. రాజాసాబ్ కొంత మేర మెప్పించాడు. ఫౌజీ మాత్రం నిరాశపరిచాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
