బాలీవుడ్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ – కిరణ్ రావు విడాకుల నుంచి ఏమండీ పేరు నిత్యం సోషల్ మీడియాలో మోగుతూనే ఉంది. అమీర్ తో పెళ్లి అని, ఆ జంట విడిపోవడానికి ఈమెనే కారణమని ఇలా రకరకాల వార్తలు రోజు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇక ఈ రూమర్లను పట్టించుకోని అమీర్, ఫాతిమా వారి వారి పనుల్లో బిజీగా మారిపోయారు. ఇక ఇటీవల ఫాతిమాపై ట్రోలింగ్ మరింత ఎక్కువయ్యింది. ఈ ఫాతిమా- అమీర్ ల పెళ్లి ఎప్పుడో అయిపోయిందని తెలుపుతూ కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో ఆమె స్పందించక తప్పలేదు.
” నేనెప్పుడూ చూడని అపరిచితులు నా గురించి ఏవేవో రాస్తున్నారు. అందులో నిజం ఉందా..? లేదా అని కూడా పట్టించుకోవడం లేదు. ఇక ఆ వార్తలను చదివేవారు నన్ను తప్పుడు వ్యక్తిని అనుకుంటున్నారు. అది నన్ను చాలాబాధిస్తుంది. దయచేసి ఇలాంటివి ఆపండి” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో కొద్దీ రోజులపాటు ఈ ట్రోల్స్ కి గేట్లు పడ్డాయి. ఇక తాజగా మరోసారి అమీర్- ఫాతిమా పెళ్లి ముచ్చట వచ్చింది. అందుకు కారణం కూడా లేకపోలేదు. తాజాగా ఈ అమ్మడు పెళ్లి కూతురు గెటప్ లో కనిపించి మెప్పించింది. అందమైన షిఫాన్ రచ్డ్ స్కర్ట్ – ఎంబ్రాయిడరీ బ్లౌజ్ సెట్ పై అంతేనా అందమైన కోట్ ని వేసుకొని పెళ్లి కూతురుగా మెరిసిపోయింది. ఇక దీంతో నెటిజన్లు మరోసారి పెళ్లి కూతురిగా మారావా..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు . ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
