Tandur Accident: పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది.. కూతురు పెళ్లి పనులకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందారు. యలల్ మండలం సగెంకుర్దులో ఘటన చోటు చేసుకుంది. సగెంకుర్దుకి చెందిన అనంతప్ప తన కుమార్తె వివాహం పెట్టుకున్నారు. కూతురు పెళ్లి పనుల నిమిత్తం యాలాల్ మండల కేంద్రానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది. దీంతో అనంతప్ప తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబీకులు చికిత్స నిమిత్తం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. కూతురు పెళ్లి కోసం వేసిన పందిరి కిందే అనంతప్ప మృతదేహాన్ని ఉంచారు.. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
READ MORE: Sri SathyaSai Dist: నేడు సత్యసాయి శత జయంతి వేడుకలు.. పాల్గొననున్న ఏపీ, తెలంగాణ సీఎంలు..