Faria Abdullah: చిట్టి.. నీ నవ్వంటే లక్ష్మీ పటాసే .. అంటూ జాతిరత్నాలతోనే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులతో కూడా అనిపించుకున్న బ్యూటీ ఫరియా అబ్దుల్లా. పక్కా హైదరాబాదీ పోరి. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించిన చిట్టికి.. ఆ తరువాత మంచి అవకాశాలు రాలేదని చెప్పాలి. ఈమధ్య వచ్చిన రావణాసుర కూడా అమ్మడికి వర్క్ అవుట్ అవ్వలేదు. ఇక ఫరియా సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. స్వతహాగా ఆమె డ్యాన్స్ కావడంతో నిత్యం డ్యాన్స్ వీడియోలు చేస్తూ కనిపిస్తుంది. ఇక ఈ మధ్య ఫరియా సైతం అందాల ఆరబోత చేస్తూ సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తోంది. తాజాగా ముద్దగుమ్మ తన హాట్ ఫోటోషూట్ ను షేర్ చేసింది. టూ పీస్ క్రాప్ టాప్ వేసుకొని సోఫాలో పడుకొని దర్శనమిచ్చింది.
Rajinikanth: వారికి రజినీకాంత్ కూతుళ్లే టార్గెట్.. మొన్న పెద్దకూతురు.. నేడు చిన్న కూతురు
సోఫాలో ఒళ్ళు విరుస్తూ.. కైపెక్కించే కళ్ళతో మెస్మరైజ్ చేస్తూ.. సోషల్ మీడియా లో ఫైర్ పుట్టిస్తోంది. ఇక ఇప్పటివరకు ఫరియా లో ఈ యాంగిల్ కూడా ఉందని ఎవరు అనుకోని ఉండరు. ఫ్లోరల్ డ్రెస్ లో ఫరియా లుక్ మాత్రం అదిరిపోయింది. ఇక ఈ అందాల ఆరబోతలో ఆ టాటూ హైలైట్ అని చెప్పాలి.. నడుముకు పై భాగంలో రెండు చక్రాలు లాంటి డిజైన్ తో ఉన్న టాటూ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ అందాల ఆరబోత అంతా అవకాశాల కోసమే కదా అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి ముందు ముందు చిట్టి.. జాతిరత్నాలు లాంటి హిట్ ను అందుకుంటుందా..? లేదా.. సెకండ్ హీరోయిన్ గా సెటిల్ అవుతుందా..? అనేది చూడాలి.
