Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Faria Abdullah Latest Interview

Faria Abdullah: ‘లైక్ షేర్ & సబ్స్క్రైబ్’ అడ్వంచర్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్..

Published Date :October 28, 2022 , 10:34 pm
By phani kandukuri
Faria Abdullah: ‘లైక్ షేర్ & సబ్స్క్రైబ్’ అడ్వంచర్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Faria Abdullah: దర్శకుడు మేర్లపాక గాంధీ, ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్ ల తాజా చిత్రం లైక్ షేర్ & సబ్స్క్రైబ్. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్ టైన్మెంట్ తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. నవంబర్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా విలేఖరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ కథలో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ?
లైక్ షేర్ & సబ్స్క్రైబ్ చాలా మంచి కథ. బిగినింగ్ నుండి ఎడింగ్ వరకూ చాలా లేయర్స్ వున్న స్క్రిప్ట్. నాకు ప్రయాణం అంటే చాలా ఇష్టం. లైక్ షేర్ & సబ్స్క్రైబ్ కథ ట్రావెలింగ్ నేపధ్యంలో వుంటుంది. అలాగే ఇందులో నా పాత్రలో చాలా మలుపులు, ఎత్తుపల్లాలు వుంటాయి. ఇందులో ప్రతి పాత్రకు ఒక నేపధ్యం ఉంటూ కథలో భాగం అవుతుంది.

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ లో మీ పాత్ర ఎలా వుండబోతుంది ?
ఇందులో ట్రావెల్ వ్లాగర్ గా కనిపిస్తా. వీడియోస్ కోసం దేశమంతా తిరిగే పాత్ర ఇది. ఈ ప్రయాణంలో హీరోని కలుస్తా. తను కూడా ఒక ట్రావెల్ వ్లాగర్. కథ చాలా ఎంటర్ టైనింగా వుంటుంది. లైక్ షేర్ & సబ్స్క్రైబ్ ప్రయాణంలో మర్చిపోలేని జ్ఞాపకాలు వున్నాయి. జీవితంలో మొదటి విదేశీ ప్రయాణం ఈ సినిమా వలనే జరిగింది. థాయిలాండ్ లో ఒక పాట షూట్ చేయడం కోసం వెళ్లాను. మర్చిపోలేని జ్ఞాపకం ఇది.

జాతిరత్నాలు, లైక్ షేర్ & సబ్స్క్రైబ్.. ఈ రెండు చిత్రాల ట్రైలర్స్ ని ప్రభాస్ గారు విడుదల చేయడం ఎలా అనిపించింది ?
లక్కీ ఛార్మ్ గా ఫీలౌతున్నా. జాతిరత్నాలు తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న రోల్స్ లో కనిపించా. లైక్ షేర్ & సబ్స్క్రైబ్ హీరోయిన్ గా నా రెండో సినిమా. చాలా ఎక్సయిటెడ్ గా వుంది. జాతిరత్నాలు లానే ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది.

హీరో సంతోష్ శోభన్ గురించి ?
సంతోష్ శోభన్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. చాలా ప్యాషనేట్ గా పని చేస్తారు. సంతోష్ శోభన్ తో నటించడం ఆనందంగా వుంది.

దర్శకుడు మేర్లపాక గాంధీ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
మేర్లపాక గాంధీ గారితో పని చేయడం డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. చాలా క్లారిటీతో డైరెక్ట్ చేస్తారు. ఆయన ఫన్ కూడా చాలా నేచురల్ గా వుంటుంది. ఆయన్ని బ్లైండ్ గా ఫాలో అయిపోయా. షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశా.

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ విషయంలో మీకు సవాల్ గా అనిపించిన అంశాలు ఏమిటి ?
చాలా అడ్వంచర్ మూవీ ఇది. అడ్వంచర్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్. 40 శాతం సినిమా అడవిలో జరుగుతుంది. ఇరవై రోజులు అడవిలోనే వున్నాం. సిగ్నల్ కూడా వుండదు. ట్రైలర్ లో ఒక ఊబి కనిపిస్తుంది. దాన్ని క్రియేట్ చేశాం. అలాగే యాక్షన్, చేజింగ్ సీన్లు వున్నాయి. మొత్తం ఖత్రోన్ కే ఖిలాడీ లాంటి అనుభవం ఇచ్చింది (నవ్వుతూ).

మీ మొదటి సినిమా జాతిరత్నాలు లో ‘చిట్టి’ పాత్రకు మంచి పేరొచ్చింది కదా.. ఆ పేరుతోనే పిలుస్తున్నారు.. ఈ విషయంలో భాద్యత పెరిగిందని అనిపిస్తుందా ?
‘చిట్టి’ పాత్రని అందరూ అభిమానించారు. చిట్టి అనేది ఒక ఎమోషన్ గా మారింది. ఈ విషయం లో ఆనందంతో పాటు భాద్యత కూడా పెరిగింది. నా స్కిల్ పై నాకు పూర్తి నమ్మకం వుంది. అయితే ప్రేక్షకులు ఎలాంటి కంటెంట్ ని ఆదరిస్తారనేది కూడా ఇక్కడ కీలకం. నా పాత్ర వరకూ వందశాతం బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా. ఈ సినిమాలో చిట్టి కాదు వసుధనే కనిపిస్తుంది.

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సుదర్శన్ కి మీకు మంచి కాంబినేషన్ ఉంటుందని విన్నాం ?
అవును. సుదర్శన్ ఫన్నీ పర్శన్. ఆయనతో పని చేయడం ఆనందంగా వుంది. ఈ కథ చాలా లో ఎంటర్టైన్మెంట్ వుంది.

మరో రెండేళ్ళలో ఇలా వుండాలానే టార్గెట్స్ ఏమైనా ఉన్నాయా ?
రెండేళ్ళు కాదు కానీ.. మరో ఐదేళ్ళతో పాన్ వరల్డ్ వుండాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం తమిళ్ లో సుసీంధిరన్ దర్శకత్వంలో విజయ్ అంటోనీ హీరో గా ఒక సినిమా చేస్తున్న. సుసీంధిరన్ గారు ఎంతో గౌరవం చూపిస్తారు. 25 ఏళ్ళు ఇండస్ట్రీలో పక్కాగా వుంటానని వారు చెప్పడం గొప్ప సంతోషాన్ని ఇస్తుంది.

ఇకపై ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలని అనుకుంటున్నారు.. లిమిటేషన్లు ఏమైనా ఉన్నాయా ?
లిమిటేషన్లు ఏమీ లేవు. యాక్షన్, సూపర్ నేచురల్, సైకో థ్రిల్లర్స్ .. ఇలా అన్నీ పాత్రలు చేయాలని వుంది. అయితే ఏ పాత్రని చేసిన రిలేటిబుల్ గా వుండాలి.

కొత్తగా చేయబోతున్న సినిమాలు ?
రవితేజ రావణాసుర, ఒక తమిళ్ మూవీ, ఒక హిందీ సిరిస్ చేస్తున్నా.

దర్శకత్వం పై ఆసక్తి వుందని చెప్పారు కదా ఎలాంటి సినిమాలు చేస్తారు ?
నాకు ఆర్ట్ ఫిలిమ్స్ చాలా ఇష్టం. అలాగే మ్యూజికల్ ఫిలిమ్స్ కూడా ఇష్టం. అయితే దర్శకత్వం ఇప్పుడు కాదు.. మరో పదేళ్ళు పడుతుంది.

అల్ ది బెస్ట్
థాంక్స్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Faria Abdullah
  • like share and subscribe movie
  • merlapaka ghandi
  • Santhosh Shobhan

తాజావార్తలు

  • MonaLisa: మహాకుంభమేళ ‘వైరల్ గర్ల్’ మోనాలిసా ప్రేమ పెళ్లిలో కీలక మలుపు.. భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు

  • Gold Price Trends: బంగారం ధరల విషయంలో ఏం జరుగుతోంది? చైనా, మరో చిన్న దేశం సైలెంట్‌ గేమ్‌..!

  • Yuvraj Singh 6 Sixes Story: “నా కొడుకు కెరీర్‌ను ముగించావు”.. యువరాజ్‌తో స్టువర్ట్ బ్రాడ్ తండ్రి ఎమోషనల్!

  • Prabhas Fauji : ప్రభాస్ ‘ఫౌజీ’ స్పీడ్ మామూలుగా లేదుగా!

  • Jasmine Perfume at Home: ఇంట్లోనే మల్లె పువ్వులతో పెర్ఫ్యూమ్ ఇలా తయారు చేయండి.. ఖరీదైన పెర్ఫ్యూమ్‌లు కూడా పనికిరావు అంతే..!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions