Faria :దళపతి విజయ్ వారసుడు ‘ఫ్యూచర్ సీఎం’ .. సంజయ్‌పై నటి ఫరియా అబ్దుల్లా క్రేజీ కామెంట్స్!

Jason Sanjay

Jason Sanjay

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ దశాబ్దాల సినీ ప్రస్థానానికి ముగింపు పలికి రాజకీయాల్లో పూర్తిస్థాయిలో బిజీ అవుతుంటే.. ఆయన వారసుడు జాసన్ సంజయ్ మాత్రం మెగాఫోన్ పట్టి డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ‘సిగ్మా’ సినిమాతో దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అయితే, ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న టాలీవుడ్ ‘జాతిరత్నాలు’ బ్యూటీ ఫరియా అబ్దుల్లా తాజాగా తన డైరెక్టర్ జాసన్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా అబ్దుల్లా.. ‘సిగ్మా’ ఈవెంట్‌లో జాసన్ సంజయ్ స్టేజ్ ప్రెజెన్స్ చూసి తాను అవాక్కయ్యానని చెప్పుకొచ్చింది. తండ్రికి తగ్గ తనయుడిగా అతడిలో గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయంటూ ఆమె చేసిన కామెంట్స్ విజయ్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి.

“ఆడియో లాంచ్ వేదికపై ఆయన ఎంతో కాన్ఫిడెంట్ గా కనిపించారు. నేరుగా పోడియం అడిగి మరీ ఆయన మాట్లాడిన తీరు, ఆ వాగ్ధాటి చూస్తే నాకు నిజంగా షాక్ అనిపించింది. ఆయన స్పీచ్ వింటుంటే.. భవిష్యత్తులో పాలిటిక్స్ లోకి వెళ్తాడేమో, లేదా ఫ్యూచర్ సీఎం అయ్యే ఛాన్స్ కూడా ఉందేమో అనిపించింది” అంటూ ఫరియా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తండ్రి విజయ్ ‘తమిళగ వెట్రి కజగం’ పార్టీతో సీఎం కుర్చీ లక్ష్యంగా అడుగులు వేస్తుంటే, ఇప్పుడు కొడుకులోనూ ఫరియాకు అలాంటి పొలిటీషియన్ లక్షణాలు కనిపించడం సర్వత్రా హాట్ టాపిక్‌గా మారింది. తండ్రి సూపర్ స్టార్ అయినప్పటికీ ఆ ఇమేజ్ చట్రంలో జాసన్ ఇరుక్కుపోలేదని ఫరియా స్పష్టం చేసింది. కేవలం 24 ఏళ్ల వయసులోనే ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ సెట్‌ను అతను హ్యాండిల్ చేస్తున్న విధానంపై ఆమె ప్రశంసల వర్షం కురిపించింది. “షూటింగ్ సెట్‌ను జాసన్ ఎంత కూల్ గా, ఎంత ప్రొఫెషనల్ గా హ్యాండిల్ చేస్తాడో చూస్తే నిజంగా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. అతని పనితీరు, విజన్ చూశాక.. కేవలం ‘విజయ్ గారి అబ్బాయి’ అనే స్టార్ కిడ్ ఇమేజ్‌ను జనాలు కొద్దిసేపటికే మర్చిపోతారు. తన టాలెంట్ తో డైరెక్టర్‌గా తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటాడు” అని ఫరియా తన దర్శకుడిపై అపారమైన నమ్మకం వ్యక్తం చేసింది.