Mirai : తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ నేడు రిలీజ్ అయింది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. తేజ యాక్షన్ సీన్లు, మనోజ్ విలనిజం, భారీ వీఎఫ్ ఎక్స్.. విజువల్ ట్రీట్ ఇచ్చేశాయి. ఇతిహాసాలను బేస్ చేసుకుని వచ్చిన మూవీ.. మాస్ తో పాటు క్లాస్ ఆడియెన్స్ ను కట్టిపడేసేలా ఉందని టాక్ వస్తోంది. అయితే ఈ సినిమాలో ఓ రెండు సాంగ్స్ కోసం వెళ్లిన అభిమానులకు మాత్రం నిరాశే మిగిలింది. అందులో ఒకటి వైబ్ ఉందిలే పాట. ఇంకొకటి నిధి అగర్వాల్ స్పెషల్ సాంగ్. ఈ రెండు సాంగ్స్ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఊహించుకున్నారు. ఇద్దరు హీరోయిన్ల అందాలను చూడొచ్చు అనుకుంటే.. ఏకంగా లేపేశారు.
Read Also : Rashmika : విజయ్ తో ఎంగేజ్ మెంట్.. తానే అందరికీ చెప్తానన్న రష్మిక..
వైబ్ ఉందిలే పాటను ముందే రిలీజ్ చేశారు. నిధి సాంగ్ ను మాత్రం థియేటర్లలోనే చూపించాలి అనుకున్నారు. కానీ మూవీ కథ, స్క్రీన్ ప్లేను ఈ రెండు పాటలు డిస్టర్బ్ చేస్తాయేమో అని చివరి నిముషంలో తీసేశారంట. ఆ విషయాన్ని బయటకు చెప్పలేదు. కానీ థియేటర్లలో ఆడియెన్స్ కు ఈ విషయంలో ఒకింత నిరాశే ఎదురైంది. నిధి అగర్వాల్ అందాలకు ఏ స్థాయి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా నిధి అగర్వాల్ స్పెషల్ సాంగ్ చేసిందటే.. ఏ రేంజ్ లో అందాలను ఆరబోస్తుందో అని ఆమె ఫ్యాన్స్ వెయిట్ చేశారు. చివరికి ఇలా జరిగింది. అయితే నిధి అగర్వాల్ చేసిన సాంగ్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేయబోతున్నారంట. అలాగే వైబ్ ఉందిలే వీడియో సాంగ్ కూడా రాబోతోంది. కానీ ఎప్పుడు అనేది తెలియాల్సి ఉంది.
Read Also : Rithika Nayak : టాలీవుడ్ కు మరో స్టార్ హీరోయిన్ వచ్చేసినట్టే..
