Site icon NTV Telugu

Boyapati Srinu: ఆయన్ని చూడగానే మాస్ ఆడియన్స్ ఒక్కసారిగా ‘జై’ అని లేస్తారు

Boyapati Srinu

Boyapati Srinu

దాసరి గారు, రాఘవేంద్ర రావు తర్వాత బీ గోపాల్ కమర్షియల్ సినిమాలని అగ్రెసివ్ గా చేశారు. అత్యధిక హిట్ పర్సెంటేజ్ ఉన్న బీ గోపాల్ తరం అయిపోతుంది అనుకునే సమయానికి వీవీ వినాయక్, రాజమౌళిలు బయటకి వచ్చారు. దాదాపు దశాబ్దం పాటు ఈ ఇద్దరు దర్శకులు బాక్సాఫీస్ పై కమర్షియల్ సినిమాలతో దండయాత్ర చేశారు. వినాయక్ ‘ఆది’ సినిమా చేస్తే, రాజమౌళి సింహాద్రి సినిమా చేశాడు. వినాయక్ ఠాగోర్ అంటే రాజమౌళి ఛత్రపతి అన్నాడు. మాస్ సినిమాలని, బ్లడ్ బాయిలింగ్ కమర్షియల్ సినిమాలని చేసి తమకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్న ఈ దర్శకులు నెమ్మదిగా ట్రాక్ మార్చారు. వినాయక్  కృష్ణ, అదుర్స్ లాంటి సినిమా చెయ్యడం మొదలు పెడితే రాజమౌళి మర్యాద రామన్న లాంటి సినిమాలు చేశాడు. ఇక్కడి నుంచి రాజమౌళి-వినాయక్ ల మాస్ సినిమాలకి ఎండ్ కార్డ్ వేసి, పూర్తిగా కొత్త ట్రెండ్ లోకి వెళ్లిపోయారు.

Read Also: Balakrishna and Boyapati : బాలయ్యతో యుద్ధం చేస్తున్న బోయపాటి

ఇక మాస్ సినిమాలకి ఆడియన్స్ కరువు అవుతారేమో అనుకుంటున్న సమయంలో ఇండస్ట్రీలోకి వచ్చాడు బోయపాటి శ్రీను. భద్ర, తులసి, సింహా, లెజెండ్, అఖండ, సరైనోడు లాంటి సినిమాలతో బోయపాటి శ్రీను కమర్షియల్ సినిమాలని తెరకెక్కించాడు. బోయపాటి శ్రీను నుంచి సినిమా వస్తుంది అంటే అప్పటివరకూ సైలెంట్ గా మాస్ ఆడియన్స్ ఒక్కసారిగా ‘జై’ అని లేస్తారు. అంతలా బీ, సి సెంటర్స్ ఆడియన్స్ ని బోయపాటి శ్రీను అట్రాక్ట్ చేసుకున్నాడు. బాలయ్య లాంటి హీరోని ఈ జనరేషన్ ఎగబడి చూస్తున్నారు అంటే అది బోయపాటి మేకింగ్ ఇంపాక్ట్ అనే చెప్పాలి. అల్లు అర్జున్ ఈరోజు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కానీ వంద కోట్ల మార్కెట్ ని బన్నీకి ఇచ్చియన్ మొదటి దర్శకుడు బోయపాటినే. రవితేజ ఎన్నో సినిమాలు చేసి ఉండొచ్చు కానీ విక్రమార్కుడు తర్వాత ఆ స్థాయిలో ఎంటర్టైన్మెంట్ అండ్ యాక్షన్ ఉండే ఏకైక సినిమా భద్ర మాత్రమే.

ఇలా తను ఏ హీరోతో సినిమా చేసిన అది మాస్ కి బెంచ్ మార్క్ అనేలా, ఊర మాస్ కి కేరాఫ్ అడ్రెస్ అనేలా సినిమా చెయ్యడం బోయపాటి శ్రీనుకి వెన్నతో పెట్టిన విద్య. యాంటి గ్రావిటీ ఫైట్స్, లాజిక్ లేని యాక్షన్ ఎపిసోడ్స్ బోయపాటి శ్రీను సినిమాల్లోనే కనిపిస్తాయని అందరూ ట్రోల్ చేస్తారు కానీ బీ, సి సెంటర్స్ ఆడియన్స్ ని మాత్రం బోయపాటి శ్రీను సాటిస్ఫై చేసినంతగా ఇంకో దర్శకుడు చెయ్యడు. ప్రతి హీరోకి బెంచ్ మార్క్ సినిమాలని ఇచ్చిన బోయపాటి శ్రీను, ప్రస్తుతం రామ్ పోతినేనితో ఒక సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రిలీజ్ టార్గెట్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి బోయపాటి శ్రీనుకి బర్త్ డే విషెస్ చెప్తూ ఒక ఫోటో బయటకి వదిలేరు. ఈ ఫోటోలో బోయపాటి శ్రీను చాలా స్టైలిష్ గా ఉన్నాడు.

Read Also: HBD Boyapati Srinu : ధనాధన్… బోయపాటి శ్రీను!

“బాబు రెడీ బాబు, బాబు రెడీ… లైట్స్, కెమెరా, యాక్షన్” అని తన ప్రతి సినిమాకి ముందు కనిపించే బోయపాటి శ్రీనుకి నందమూరి ఫాన్స్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. రామ్ పోతినేనితో సినిమా అయిపోగానే బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఇంకో సినిమా స్టార్ట్ అవ్వనుంది. ఇప్పటికే మూడు హిట్స్ ఇచ్చిన ఈ కాంబినేషన్, నాలుగో సినిమాని ఎలక్షన్ టార్గెట్ గా చేస్తున్నారు. మరి ఈసారి ఎలాంటి సినిమా చేస్తారో చూడాలి.

Exit mobile version