ఎఫ్2 (ఫన్ & ఫ్రస్ట్రేషన్)కి సీక్వెల్‌గా ఎఫ్3 సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే! దాదాపు ఆ సినిమాలో ఉన్న కాస్టింగే, ఇందులోనూ ఉంది. అదనపు ఆకర్షణగా సునీల్‌తో పాటు సోనాల్ చౌహాన్‌కి కూడా దర్శకుడు అనిల్ రావిపూడి తీసుకున్నాడు. తొలి సినిమా కన్నా ఈ సీక్వెల్‌తో మరిన్ని నవ్వులు పూయించాలన్న అనిల్ పూనుకోవడమే కాదు, ఇది కచ్ఛితంగా డబుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని నమ్మకంగా ఉన్నాడు కూడా! దాదాపు ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకోవడంతో, చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాల్ని మొదలుపెట్టింది.
ఆల్రెడీ పోస్టర్లు, పాటలతో హంగామా మొదలుపెట్టిన యూనిట్.. ఇప్పుడు ట్రైలర్ విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ట్రైలర్ రిలీజ్‌కి ముహూర్తం ఖరారు చేసినట్టు, ఓ పోస్టర్‌తో అధికార ప్రకటన చేసింది కూడా! రేపు (మే 9న) ఉదయం 10:08 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నామని, బొంబాస్టిక్ ఫన్ ఎక్స్ప్లోజన్కి సిద్ధంకండని ట్విటర్ మాధ్యమంగా మేకర్స్ పేర్కొన్నారు. తొలి సినిమా ఘన విజయం సాధించింది కాబట్టి, ఈ సీక్వెల్‌పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. మరి, వాటిని అందుకుంటుందో, లేదో అనే విషయం.. రేపు విడుదలయ్యే ట్రైలర్‌తో తేలిపోతుంది.
Prepare for the Bombastic FUN Explosion !!! 💥💣#F3Trailer Releasing Tomorrow, May 9th @ 10:08AM ⏰
BIGGEST FUN FRANCHISE #F3Movie 🥳@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @sonalchauhan7 @ThisIsDSP @SVC_official @adityamusic #F3OnMay27 pic.twitter.com/4lCKl9Th6Q
— Sri Venkateswara Creations (@SVC_official) May 8, 2022