Krishna Vrinda Vihari: ‘ఏముందిరా’ అంటూ హీరోయిన్ వెంట పడుతున్న నాగశౌర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇటీవల ఈ హీరో నటించిన ‘వరుడు కావలెను’ డీసెంట్ హిట్ ను అందుకున్నా కలెక్షన్ల పరంగా కొద్దిగా వెనకంజ వేసిన విషయం విదితమే. ఇక దీంతో ఈసారి భారీ హిట్ అందుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే నాగ శౌర్య నటిస్తున్న చిత్రం “కృష్ణ వ్రింద విహారి”. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో ఉషా మల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘ఏముందిరా.. ఈ అద్భుతాన్ని చూడు’ అంటూ సాగే ఈ పాట సంగీత అభిమానులను అలరిస్తోంది. మహతి స్వర సాగర్ స్వరపరిచిన ఈ పెప్పీ డ్యాన్స్ నంబర్ ను సింగర్ హరిచరణ్ ఆలపించారు. ఇక వీడియో లో నాగ శౌర్య లుక్ ఆకట్టుకొంటుంది. పైన కోటు, కింద పంచె, నుదుటిన నామంతో ఎంతో అందంగా కనిపించాడు. ఈ చిత్రంలో శౌర్య బ్రాహ్మణ యువకుడిగా కనిపించాడు. మోడ్రన్ డ్రెస్ లో ఉన్న హీరోయిన్ ను ఒక్కసారిగా సాంప్రదాయ దుస్తుల్లో చూసి ఆమెను వర్ణిస్తున్నట్లు గీత రచయిత హర్ష సాహిత్యం అందించిన తీరు బావుంది. ఇక ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించింది. ఇకపోతే మే 20న ఈ చిత్రం విడుదల కానుంది. మరి ఈ చిత్రంతో నాగ శౌర్య హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.
Also Read
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
- The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్‌తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
- The Paradise Teaser: నాని మాస్ విశ్వరూపం.. ‘ది ప్యారడైజ్’తో బాక్సాఫీస్ బద్దలేనా!
- Varun Tej: పవన్ కళ్యాణ్ మాటలు గుర్తుచేసుకున్న వరుణ్ తేజ్..
తాజావార్తలు
-
Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
-
Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
-
Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
-
West Bengal: మసీదు లౌడ్‌స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
-
Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!