NTV Telugu Site icon

Emraan Hashmi: OG విలన్ ని సెట్ చేసిన గూఢచారి…

G2

G2

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాల్ మోస్ట్ అంటిసిపేటెడ్ మూవీ OG. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మాఫియా బ్యాక్ డ్రాప్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజస్ గంభీర అనే పాత్రలో కనిపించనున్నాడు. ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాలో పవన్ కళ్యాణ్ కి విలన్ గా ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. ఇటీవలే నెగటివ్ రోల్స్ ప్లే చేస్తున్న ఇమ్రాన్ హష్మీ ఇప్పుడు మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో కూడా విలన్ గా నటించడానికి రెడీ అయ్యాడు. అడివి శేష్ హీరోగా గూఢచారి సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న భారీ బడ్జట్ సినిమా గూఢచారి 2. గతేడాది డిసెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ సినిమాలో విలన్ గా ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు.

Read Also: RC 16: బుచ్చి మావా… నువ్వు కొట్టే హిట్ సౌండ్ పాన్ వరల్డ్ వినిపించాలి…

ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ఇమ్రాన్ హష్మీ జాయిన్ అవ్వడంతో గూఢచారి 2 మార్కెట్ స్పాన్ మరింత పెరిగింది. విజయ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బనిత సంధు హీరోయిన్ గా నటిస్తోంది. గూఢచారి సినిమా తెలుగులో స్పై సినిమాలకి మార్కెట్ క్రియేట్ చేసింది. తక్కువ బడ్జట్ లో థ్రిల్లింగ్ సినిమాని ఆడియన్స్ కి ఇచ్చి హిట్ కొట్టిన శేష్… ఇప్పుడు సాలిడ్ బడ్జట్ అండ్ స్టెల్లార్ స్టార్ కాస్ట్ తో ఎలాంటి సినిమా చేస్తాడు? ఏ రేంజ్ హిట్ కొడతాడు అనేది చూడాలి.

Read Also: April 5th: దేవర డేట్ ని కబ్జా చేసిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్…