Site icon NTV Telugu

Bhartha Mahasayulaku Wignnyapthi: ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’కు మరో కొత్త అవతారం.. సత్య కామెడీ డాన్స్‌కు థియేటర్లలో నవ్వుల పండుగే!

Satya Ellu Vochi Godaramma

Satya Ellu Vochi Godaramma

తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన పాటల్లో ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ ఒకటి. దివంగత నటులు శోభన్‌బాబు, శ్రీదేవి జంటగా నటించిన ‘దేవత’ సినిమాలో ఈ పాట ఎంతటి సూపర్ డూపర్ హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాలం మారినా ఈ పాటకు ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇదే పాటను వరుణ్ తేజ్, పూజా హెగ్డే నటించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో రీమిక్స్ చేశారు. ఆ వెర్షన్ కూడా యూత్‌తో పాటు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు అదే పాట మరో కొత్త రూపం వచ్చింది.

దర్శకుడు కిశోర్ తిరుమల తాజాగా కమెడియన్ సత్యపై ఎల్లువొచ్చి గోదారమ్మ పాటను వినోదాత్మకంగా చిత్రీకరించారు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాలో ఓ డాన్సర్‌తో కలిసి సత్య చేసే కామిక్ పర్ఫార్మెన్స్‌, డాన్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ క్లాసిక్ పాటకు సత్య టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్‌ తోడవ్వడంతో థియేటర్లలో అభిమానులు పగలబడి నవ్వుకుంటున్నారు. ఈ ప్రత్యేక సాంగ్ సినిమాలో ప్రేక్షకులను అలరిస్తోంది. ఎల్లువొచ్చి గోదారమ్మ పాట మరోసారి ప్రేక్షకుల మనసు దోచేస్తోంది. క్లాసిక్‌కు మోడర్న్ కామెడీ తోడవ్వడంతో థియేటర్లలో ఈలలు, కేకలతో ఫాన్స్ రచ్చ చేస్తున్నారు.

Also Read: Lizelle Lee: రిటైర్మెంట్‌, 100 కేజీల బరువు.. అయినా డబ్ల్యూపీఎల్‌ 2026లో దూసుకుపోతున్న లిజెలీ!

కిషోర్ తిరుమల దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ నటించిన సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. 2026 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం నేడు (జనవరి 13)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే మొదటి షో పూర్తవ్వగా.. హిట్ టాక్ అందుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ అంటూ రవితేజ ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. రావన్న ఖాతాలో బిగ్ హిట్ పడిందని అభిమానులు సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో యువ కహనాయికలు ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి గ్లామర్ ప్లస్ అయింది. సునీల్, వెన్నెల కిషోర్, సత్య లాంటి టాప్ కమిడీయన్స్ నటించారు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించారు.

Exit mobile version