Ekta Kapoor: నిర్మాత ఏక్తా కపూర్‌కి అరెస్ట్ వారెంట్.. ఆ బూతు సిరీసే కారణం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ekta Kapoor, Shobha Kapoor Receive Arrest Warrants For ‘XXX’ Season 2: బాలీవుడ్‌లో ఉన్న ప్రముఖ నిర్మాతల్లో ఏక్తా కపూర్ ఒకరు. ఈమె సీరియల్స్, వెబ్ సిరీస్‌లతో పాటు సినిమాలను నిర్మిస్తుంది. ఈమధ్య ఆల్ట్ బాలాజీ అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్ కోసం ఈమె వరుసగా బూతు వెబ్ సిరీస్‌లను నిర్మిస్తోంది. ఓటీటీలో అడల్ట్ కంటెంట్‌కి సెన్సార్ ఉండకపోవడం, యువత కూడా వాటికి బాగా ఆకర్షితులు అవుతుండడంతో.. అడల్ట్ కంటెంట్‌తో రకరకాల వెబ్ సిరీస్‌లను లాంచ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె XXX అనే వెబ్ సిరీస్ నిర్మించింది. మొదటి సీజన్‌కి యూత్ నుంచి మంచి ఆదరణ రావడంతో, రెండో సీజన్‌ని ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో తీసింది. అదే ఆమె కొంపముంచింది. అందులో సైనిక కుటుంబాల మనోభావాలు దెబ్బతీసేలా చూపించారని విమర్శలు వచ్చాయి. కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఏక్తా కపూర్, ఆమె తల్లి శోభ కపూర్‌లకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.
2020లో బీహార్‌లోని బేగుసరైకు చెందిన శంభు కుమార్ అనే మాజీ సైనికుడు.. సైనికుల్ని అవమానపరిచేలా, వారి కుటుంబ విలువలు దెబ్బతీసేలా XXX రెండో సీజన్‌లో సీన్లను చిత్రీకరించారంటూ ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి ఈ కేసు విచారణ కోర్టులో సాగుతోంది. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత ఆ కేసులో ఏక్తా, శోభలపై ధర్మాసనం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీనిపై అడ్వొకేట్ హృరికేశ్ పాఠక్ మాట్లాడుతూ.. ‘‘కోర్టు ఇదివరకే వాళ్లను హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. కానీ వాళ్లు కోర్టు ఆదేశాల్ని బేఖాతరు చేస్తూ.. కోర్టులో హాజరు కాలేదు. అందుకే అరెస్ట్ వారెంట్ జారీ చేసింది’’ అని పేర్కొన్నారు. మరోవైపు.. సీరియల్స్ నిర్మించి ఎంతో పేరు గడించిన ఏక్తా కపూర్ ఇప్పుడు విమర్శలపాలవుతోంది. జీవితాంతం అనుభవించేంత డబ్బున్నప్పటికీ.. ఇంకా డబ్బులు సంపాదించుకోవడం కోసం అడల్ట్ కంటెంట్‌ని అడ్డం పెట్టుకోవడం దురదృష్టకరమని నెటిజన్లు ఆమెను ఏకిపారేస్తున్నారు.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
కాగా.. ఏక్తా, శోభ కపూర్‌లపై ఇతర ప్రాంతాల్లో కూడా XXX రెండో సీజన్ విషయమై కేసులు నమోదయ్యాయి. నీరజ్ యగ్నిక్ చేసిన ఫిర్యాదు మేరకు.. 2020లో అన్నపూర్ణ పోలీస్ స్టేషన్‌లో వారిపై ఇండియన్ పీనల్ కోడ్ & ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అలాగే.. బీహార్‌లోని ముజప్ఫర్పు్ర్ కోర్టులో కూడా వారిద్దరిపై ఫిర్యాదు అందింది. ఇంత జరుగుతున్నా.. ఏక్తా కపూర్, శోభ కపూర్‌లు మాత్రం తమకేమీ ఎరుగనట్టుగా వ్యవహరిస్తుండడం గమనార్హం.
తాజావార్తలు
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
-
Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
-
Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!