టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లు చాలా తక్కువమంది.. అందం, అభినయం కలబోసినా ఆ తెలుగు హీరోయిన్లలో ఈషా రెబ్బ ఒకరు. తెలుగుతనం ఉట్టిపడే నగుమోము.. కళ్ళతో భావాలు పలికించగల అభినయం ఆమె సొంతం. ఇటీవల 3 రోజెస్ వెబ్ సిరీస్ తో మంచి విజయాన్ని అందుకున్న ఈషా.. మరో రెండు సినిమాలతో బిజీగా మారింది.
ఇక సోషల్ మీడియాలో ఈషా ఫోటోషూట్లకు కొదువే లేదు. వెస్ట్రన్, ఫార్మల్, ట్రెడిషినల్ అంటూ నిత్యం ఫోటోషూట్లతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఇక తాజాగా ఈ అచ తెలుగందం.. తెలుగింటి ఆడపడుచులా ముస్తాబై అభిమానుల మనసులను దోచుకొంటుంది. లైట్ బ్లూ కలర్ చీరపై పింక్ కలర్ బ్లౌజ్.. సిల్వర్ కలర్ ఆభరణాలతో దేవతలా కనిపించింది. అందమే అతివగా మారితే ఈషానా అన్నట్లు ఉంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది.
