NTV Telugu Site icon

Eagle: ‘ఈగల్’ గా రవితేజ.. ఈసారి ప్రకంపనలు మాములుగా ఉండవు

Egale

Egale

Eagle: మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వాల్తేరు వీరయ్యతో హిట్ అందుకున్నా.. రావణాసురతో ప్లాప్ ను మూటకట్టుకున్నాడు. ఇక విజయాపజయాలతో రవితేజకు పట్టింపు లేదు అన్న విషయం అందరికి తెల్సిందే. ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ తో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను పట్టాలెక్కించాడు రవితేజ. సూర్య వర్సెస్ సూర్య సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని చాలా గ్యాప్ తరువాత రవితేజతో జతకట్టాడు. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. నిన్నటి నుంచి ఈ సినిమా అనౌన్స్ మెంట్ కోసం అభిమానులందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపుల సమయం దాటిపోయింది. ఎట్టకేలకు ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ ప్రకటించారు. ఎప్పటినుంచో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘ఈగల్’ అనే పేరునే ఖరారు చేసి.. టైటిల్ అనౌన్స్ మెంట్ టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ మొత్తంలో రవితేజ క్యారెక్టరయిజేషన్ గురించే చెప్పుకొచ్చారు.

Padma Shri: అలీకి ‘పద్మశ్రీ’ ఇవ్వాలంటున్న అలనాటి నటి రాజశ్రీ

” వాంటెడ్ పెయింటర్” అంటూ ఒక చిన్నపాప డైలాగ్ తో మొదలైన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ఒక పెయింటర్ కోసం.. రా ఏజెన్సీ తిరుగుతూ ఉంటుంది. అతడి గురించి ఒక్కొక్కరు.. ఒక్కోలా చెప్తూ కనిపించారు. కొంతమంది అతడిని పెయింటర్ అంటుంటే.. మరికొంతమంది రైతు అని చెప్పుకొస్తూ ఉంటారు. ఇక ఇదే విషయాన్ని హీరోయిన్ అనుపమ ద్వారా రివిల్ చేయించారు. ” ఒక మనిషి చుట్టూ ఇన్ని కథలు ఏంటి .. ? ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలు ఏంటి.. ?” అనగానే మాస్ మహారాజా రవితేజ ఈగల్ టైటిల్ ను రివీల్ చేశారు. అయితే పూర్తిగా రవితేజ లుక్ ను మాత్రం రివీల్ చేయలేదు. ఇక కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేస్తుంది.. అని నవదీప్ చెప్పినట్లు .. చివర్లో రవితేజ చూపు యాప్ట్ గా నిలిచింది. ఇక సినిమా మొత్తానికి హైలైట్ అంటే సంగీతమనే చెప్పాలి. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ డావిజన్డ్ అదరకొట్టేశాడు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సంక్రాంతికి వేసేది చలి మంట కాదు దావాగ్ని అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో రవితేజ మరో హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.