NTV Telugu Site icon

Eagle: దళం..సైన్యం కాదు.. దేశం వచ్చినా ఆపుతాను.. అదిరిపోయిన ఈగల్ ట్రైలర్

Raviteja

Raviteja

Eagle: మాస్ మహారాజా రవితేజ, అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈగల్. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో అలరించనున్నాడు. యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈగల్.. పద్దతైన దాడి అంటూ రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మాస్ మహారాజా ఎలివేషన్స్ అయితే గూస్ బంప్స్ ను తెప్పిస్తున్నాయి. ఇక కార్తీక్ ఘట్టమనేని డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.

మ్యాప్స్ కు రీసెర్చ్ కు అందని విషయం ఒకటున్నది సర్.. అక్కడ ఒకటుంటాడు అంటూ శ్రీనివాస్ రెడ్డి చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలయ్యింది. ఇక అక్కడ నుంచి యాక్షన్ సీన్స్ చూపిస్తూనే రవితేజకు ఎలివేషన్ ఇస్తూనే ఉన్నారు. ఒక ఊరును కాపాడడానికి రవితేజ ప్రయత్నిస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది. అక్కడ పదేళ్లుగా ఓ గాడ్జిల్లా వుంటోంది, ఆరోజు మృగాలను మింగే మహాకాళుడు నిద్రలేచాడు అంటూ రవితేజ క్యారెక్టర్ ను హైలైట్ చేసే డైలాగ్స్ అదిరిపోయాయి. ఇక దళం..సైన్యం కాదు.. దేశం వచ్చినా ఆపుతాను అని రవితేజ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. మొత్తానికి రిలీజ్ ట్రైలర్ తో సినిమాపై హైప్ ను క్రియేట్ చేశారు. స్టార్ క్యాస్టింగ్ కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది. అన్నింటికన్నా రవితేజ మాస్ లుక్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. మరి ఇన్ని ప్లస్ పాయింట్స్ తో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Show comments