Site icon NTV Telugu

Eagle: ఏంటీ.. కామెడీనా.. ట్రైలర్ చూసి సీరియస్ అనుకున్నామే.. ?

Raviteja

Raviteja

Eagle: మాస్ మహారాజా రవితేజ, అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈగల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రవితేజ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. రవితేజ లాంగ్ హెయిర్‌, గడ్డంతో.. లుంగీ తో ఉండడంతో మాస్ లుక్ లో కనిపించాడు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూ లు ఇస్తూ సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు. ఇక తాజాగా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఒక ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆసక్తి విషయాలను పంచుకున్నాడు.

“సినిమా కథను ట్రైలర్‌లో చూపించాం. అప్పటినుంచి ఈగల్ సీరియస్ సినిమా అని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. ఈగల్‌లో రవితేజ సార్ మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండదు. కానీ మరో మార్గంలో వినోదం ఉంటుంది. ఫైనల్‌గా ఈగల్‌ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌. ఎలాంటి విసుగు తెప్పించే ఎలిమెంట్స్‌ ఉండవు.. జోనర్‌తో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాను చూస్తారు. చాలా గ్యాప్ తరువాత రవితేజ వయసుకు తగ్గ పాత్రను చేస్తున్నాడు. మేకప్‌ లేకుండా రవితేజ ఈ సినిమాలో నటించాడు. విభిన్నమైన పాత్రలో ఆయనను చూస్తారని” చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు.. ఏంటీ.. కామెడీనా.. ట్రైలర్ చూసి సీరియస్ అనుకున్నామే.. ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Exit mobile version