NTV Telugu Site icon

Pawan Kalyan: సుజిత్ దర్శకత్వంలో పవన్.. డీవీవీ నుంచి ప్రకటన వచ్చేసింది

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ దూకుడు మీద ఉన్నారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో కెరీర్‌లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు సినిమాలో నటిస్తున్న ఆయన హరీష్ శంకర్‌తో భవదీయుడు భగత్‌సింగ్ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పుడు ఆయన మరో సినిమాకు కూడా పచ్చజెండా ఊపేశారు. సాహో ఫేం దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో పవన్ నటించబోతున్నారు. తొలుత ఈ కాంబినేషన్ పుకారు అని పవన్ అభిమానులు భావించారు. కానీ ఈ సినిమాపై ఆర్.ఆర్.ఆర్ సినిమా నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారిక ప్రకటన చేసింది.

Read Also: Text Message: ‘SMS’ @ 30 ఏళ్లు.. తొలి మెసేజ్‌ ఏంటో తెలుసా?

ఈరోజు ఉదయం 8 గంటల 55 నిమిషాలకు ఈ సినిమా గురించి డీవీవీ బ్యానర్ ట్వీట్ చేసింది. దీంతో సుజిత్-పవన్ కాంబో సినిమా నిజమే అని స్పష్టమైంది. ఈ మేరకు ఓ పోస్టర్ విడుదల చేసింది. ఇందులో ‘they call him #OG’ అని పేర్కొన్నారు. ఈ పోస్టర్‌లో పవన్ వెనుకవైపు నిలబడి ఉన్నట్లు కనిపిస్తున్నాడు. ఈ మూవీకి రవి.కె.చంద్రన్ డీవోపీ అందించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని డీటైల్స్ తెలియనున్నాయి. ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ విజయం తరువాత నిర్మాత డీవీవీ దానయ్య నుంచి వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.