మెగా పవర్ స్టార్ పామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. డివీవీ ఎంటర్ టైన్మెంట్స్ లో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఎన్నో వాయిదాల తరువాత మార్చి 25 న రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డుల సునామీ సృష్టిస్తోంది. భారీ విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటన కెరీర్ బెస్ట్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా చూసిన అభిమానులు తమ అభిమాన హీరోల ఎంట్రీ సీన్స్, గూస్ బంప్స్ సీన్స్ ని ఫోన్ లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ఇక ఈ విషయమై మేకర్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అభిమానులను వేడుకుంటూ డివీవీ ఎంటర్ టైన్మెంట్స్ ఒక ట్వీట్ కూడా చేయడం విశేషం. “దయచేసి ఫ్యాన్స్ ని వేడుకుంటున్నాం.. థియేటర్లో సీన్లను రికార్డులు చేసి , స్పాయిలర్ పోస్టులను సోషల్ మీడియాలో పెట్టకండి.. మీరు ఎలా అయితే ఆర్ ఆర్ ఆర్ మూవీ మ్యాజిక్ ను ఎంజాయ్ చేశారో అదే విధంగా అందరినీ కూడా ఎంజాయ్ చెయ్యనివ్వండి” అంటూ చెప్పుకొచ్చారు. మరి మేకర్స్ మాటను అభిమానులు ఎంతవరకు పాటిస్తారో చూడాలి.
