Durandhar 2: రన్‌టైమ్ రగడ.. ఏకంగా 4 గంటల ఫుటేజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతంలో సంచలన విజయం నమోదు చేసిన ‘దురంధర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘దురంధర్ 2’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి, అయితే, ఈ సినిమా విడుదల దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర యూనిట్ మధ్య ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ఈ సినిమా “నిడివి”, తాజా సమాచారం ప్రకారం, మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ఏకంగా 4 గంటల ఫుటేజ్‌ను సెన్సార్ పరిశీలన కోసం దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఏ సినిమాకైనా 2.5 గంటల నిడివి ఉంటేనే ప్రేక్షకుల సహనానికి పరీక్ష అని భావిస్తారు. కానీ, దర్శకుడు మాత్రం కథపై ఉన్న నమ్మకంతో నిడివి విషయంలో అస్సలు తగ్గడం లేదు.
Also Read :Geethu Royal: తిరుమలలో గీతూ ఓవరాక్షన్.. జీవితం కోల్పోయానంటూ రీల్!
Also Read
- Ravi Teja: ‘ఇరుముడి’ సక్సెస్ జోష్.. 'శివ నువ్వు తోపు సామీ'.. స్టేజ్ పైనే డైరెక్టర్‌ను హత్తుకున్న మాస్ మహారాజా!
- Shiva Nirvana: రవన్నతో ఆ సీన్ తీస్తున్నప్పుడు భయపడ్డా.. ‘ఇరుముడి’ అసలు కథ బయటపెట్టిన డైరెక్టర్!
- Baby Nakshatra: బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన ఈ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ‘ఇరుముడి’ సెట్లో ఏం జరిగిందంటే?
- Irumudi: కథ విని రవితేజ కూతురు ఏడ్చేసింది.. సీక్రెట్స్ బయటపెట్టిన శివ నిర్వాణ!
ఈ సుదీర్ఘ నిడివిపై నిర్మాతలకు, దర్శకుడికి మధ్య చిన్నపాటి కోల్డ్ వార్ నడుస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. సినిమా సుమారు 3 గంటల 40 నిమిషాల నుంచి 3 గంటల 50 నిమిషాల వరకు వచ్చే అవకాశం ఉంది. అంత నిడివి ఉంటే థియేటర్లలో షోల సంఖ్య తగ్గుతుందని, ప్రేక్షకులు కూడా ఇబ్బంది పడతారని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత వరకు ఎడిటింగ్ టేబుల్ దగ్గరే నిడివి తగ్గించాలని వారు ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు దర్శకుడు మాత్రం ‘ససేమిరా’ అంటున్నారు. కథలోని ఎమోషన్ దెబ్బతినకుండా ఉండాలంటే ఈ నిడివి తప్పనిసరి అని, ఒక్క నిమిషం కూడా తగ్గించే ప్రసక్తే లేదని భీష్మించుకు కూర్చున్నారట. సాధారణంగా సెన్సార్ బోర్డు సూచించే కట్స్, అలాగే ఫైనల్ ఎడిటింగ్ తర్వాత సినిమా నిడివి కొంత తగ్గే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!