Site icon NTV Telugu

Dunki Trailer: ఇది కంప్లీట్ గా డైరెక్టర్స్ సినిమా…

Dunki Trailer

Dunki Trailer

పఠాన్, జవాన్ సినిమాలతో యాక్షన్ మోడ్ లోకి దిగి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. ఈ రెండు సినిమాలతో రెండు వేల కోట్లు రాబట్టిన షారుఖ్, ఒకే ఇయర్ లో రెండు సార్లు వెయ్యి కోట్లు రాబట్టిన హీరోగా హిస్టరీ క్రియేట్ చేసాడు. హ్యాట్రిక్ వెయ్యి కోట్ల కలెక్షన్స్ కోసం షారుఖ్ ఇప్పుడు తన ట్రాక్ మార్చి ఎమోషనల్ రైడ్ తో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ఇండియాస్ టాప్ మోస్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీతో షారుఖ్ చేసిన డంకీ సినిమా డిసెంబర్ 21న రిలీజ్ కానుంది. ఈ హీరో-డైరెక్టర్ రేరెస్ట్ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పుడే బాలీవుడ్ లో సాలిడ్ బజ్ జనరేట్ అయ్యింది. ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ డంకీ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ఇల్లీగల్ మైగ్రేషన్ కథాంశంగా తెరకెక్కుతున్న డంకీ సినిమా ట్రైలర్ కట్ కంప్లీట్ గా డైరెక్టర్ స్టైల్ లోనే ఉండడం విశేషం. హార్డీగా షారుఖ్, మనుగా తాప్సి, ఇతర ముఖ్య పాత్రల్లో విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ నటిస్తున్నారు. షారుఖ్ ఖాన్ ట్రైలర్ లో చాలా లైవ్లీగా ఉన్నాడు, మాస్ నుంచి కంప్లీట్ గా ట్రాక్ మార్చి రాజ్ కుమార్ హిరాణీ సినిమాల్లో హీరోగా మారిపోయాడు. షారుఖ్ ని ఇలా చూడడం బాలీవుడ్ సినీ అభిమానులకి వింటేజ్ వైబ్స్ ఇవ్వడం గ్యారెంటీ.

డంకీ డ్రాప్ 4 అంటూ రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ లో కథ చెప్పేసాడు రాజ్ కుమార్ హిరాణీ. ఒక ముఖ్య కారణం కోసం ఇంగ్లాండ్ వెళ్లాలి అనుకునే కొంతమంది ఎలాంటి కష్టాలని ఫేస్ చేసారు అనేదే డంకీ కథ. సింపుల్ గా చెప్పాలి అంటే ఇండియా నుంచి ఇంగ్లాండ్ ని ఇల్లీగల్ గా వెళ్లే వాళ్ల ప్రయాణంలో ఎదురయ్యే సమస్యలు ఏంటి అనేది డంకీ కథ. ఇలాంటి కథలని కామెడీగా చెప్తూనే అండర్ కరెంట్ గా ఎమోషనల్ జర్నీని చూపించడంలో రాజ్ కుమార్ హిరాణీ దిట్ట. మరోసారి డంకీ ట్రైలర్ లో అది క్లియర్ గా కనిపించింది. ట్రైలర్ లో “బ్రిటిష్ వాళ్లు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు హిందీ వచ్చా అని మనం అడగలేదు, మనం ఇంగ్లాండ్ వెళ్తుంటే వాళ్లు మాత్రం మీకు ఇంగ్లీష్ వచ్చా అని అడుగుతున్నారు” అంటూ షారుఖ్ ఎమోషనల్ గా చెప్పిన డైలాగ్ ట్రైలర్ కే హైలైట్ గా నిలిచింది. ఎండ్ లో షారుఖ్ ఖాన్ ఏజ్డ్ గెటప్ లో కనిపించడం విశేషం. కామెడీ, లవ్, ఎమోషనల్, కొంచెం యాక్షన్… ఇలా డంకీ సినిమా కంప్లీట్ గా రాజ్ కుమార్ హిరాణీ స్టైల్ ఆఫ్ మేకింగ్ లోనే ఉంది. ఈ ట్రైలర్ పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చెయ్యడంలో సక్సస్ అయ్యింది. అయితే సలార్ కమర్షియల్ సినిమా కాబట్టి డిసెంబర్ 22న ప్రభాస్ ర్యాంపేజ్ ఉంటుంది కానీ డంకీ సినిమాకి లాంగ్ రన్ ఉండే అవకాశం ఉంది.

Exit mobile version