NTV Telugu Site icon

Dunki: నార్త్ లో సలార్ కి సింగల్ స్క్రీన్స్ ఇవ్వట్లేదా… వాడు డైనోసర్ తొక్కేస్తాడు

Dunki

Dunki

మరో రెండు రోజుల్లో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది. ఆ తర్వాత ఒక్క రోజులో ప్రభాస్ సలార్ గా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ రెండు సినిమాలు ఒక్క రోజు గ్యాప్ లో రిలీజ్ కావడం అనేది థియేటర్స్ నుంచి ఓపెనింగ్ కలెక్షన్స్ వరకూ ప్రతి విషయంలో షారుఖ్, ప్రభాస్ లని తప్పకుండా ఇబ్బంది పెడుతుంది. ఈ విషయమే క్లాష్ ఫిక్స్ అనుకున్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు. సలార్, డంకీ సినిమాల్లో ఒకటి వాయిదా పడితే బాగుంటుందని కూడా అనుకున్నారు. ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో ఇండియాస్ బిగ్గెస్ట్ క్లాష్ ఎలా ఉండబోతుందని చూడాలని ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో డంకీ సినిమాకి నార్త్ లో ఎక్కువ థియేటర్స్ కి ఇస్తూ సలార్ సినిమాకి మొండి చెయ్యి చూపిస్తున్నారు. ముఖ్యంగా సింగల్ స్క్రీన్స్ కూడా డంకీ సినిమాకే కేటాయిస్తున్నారు.

రాజ్ కుమార్ హిరాణీ సినిమాలని ఎక్కువగా A సెంటర్స్ లో చూస్తారు, డంకీ ప్రమోషన్స్ కూడా A సెంటర్ సినిమాగానే జరిగాయి. సలార్ మాస్ సినిమా, సింగల్ స్క్రీన్స్ లో సలార్ హవా ఉంటుంది. క్లాష్ ఉన్నప్పుడు థియేటర్స్ కి సమానంగా పంచాలి, ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ చేయకపోవడం తప్పు. అయితే డంకీ సినిమాకి నార్త్ లో ఎక్కువ థియేటర్స్ కి కేటాయించి, సలార్ కి హ్యాండ్ ఇవ్వడం జరగబోయే పరిణామాలని ఆలోచించట్లేదు. సలార్ కి నార్త్ లో ఎలా జరిగిందో, డంకీ సినిమాకి సౌత్ లో కూడా అలానే జరుగుతుంది. ప్రభాస్ సినిమా ఉండగా షారుఖ్ ఖాన్ కాదు కదా మొత్తం బాలీవుడ్ స్టార్స్ నటించిన సినిమా వచ్చినా సౌత్ లో థియేటర్స్ దొరికే ప్రసక్తే లేదు. పైగా డంకీ సినిమా తొక్కాలి అనుకుంటే ఆగే సినిమా కాదు సలార్… వాడు డైనోసర్… కాస్త టాక్ బాగుంటే చాలు ఎదుట ఏమున్నా తొక్కుకుంటూ పోతాడు.

Show comments