Kaantha Movie : కాంత లాంటి సినిమా మళ్లీ రాదన్నారు దుల్కర్ సల్మాన్, రానా. దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న ‘కాంత’ సినిమాను సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తుండగా.. రానా, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవంబర్ 14న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా రిపోర్టర్లతో రానా, దుల్కర్ కీలక విషయాలను పంచుకున్నారు. రానా మాట్లాడుతూ.. ఇది కంప్లీట్ ఫిక్షనల్ కథ అని. ఇది ఒక ఇన్సిడెంట్ అని చెప్పలేం. ఈ కథను ఊహించడం కష్టమే అని చెప్పాడు. అలనాటి కథ కాబ్టటి చాలా జాగ్రత్తగా తీసినట్టు తెలిపాడు.
Read Also : Nidhi Agarwal : 8 ప్లాపులు.. నిధి అగర్వాల్ కు ప్రభాస్ ఒక్కడే దిక్కు..
దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ఈ కథ నాకు నచ్చింది. మీరు సినిమా చూసినప్పుడు కూడా దీన్ని ఒక మంచి కథగానే ఫీలవుతారు. ఈ సినిమాకు మహానటి లాంటి పోలికలు ఏమీ ఉండవు. ఈ సినిమాలో ఎలాంటి సీన్లను మీరు ఊహించలేరు అంటూ తెలిపాడు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ని మళ్ళీ మళ్ళీ రీ క్రియేట్ చేయలేం. నేను రానా ఈ కథ విన్న వెంటనే కచ్చితంగా సినిమా చేయాలనుకున్నాం. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చేశాననే ఎక్స్ పీరియన్స్ అయితే నాకు ఉంది. ఈ మూవీతో నాకు ఒక బలమైన పాత్ర దొరికింది. ఇలాంటి సినిమాలు చేయడానికి నేనెప్పుడూ రెడీగానే ఉంటాను అంటూ తెలిపాడు దుల్కర్ సల్మాన్.
Read Also : SSMB 29 : చడీచప్పుడు లేకుండా పోస్టర్లు.. రాజమౌళి ఏం చేస్తున్నావ్..?
