మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు ఇప్పుడు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్నేళ్లు మలయాళ భాషలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి.. ఇప్పుడు తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. చివరగా ‘లక్కీ భాస్కర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.గత ఏడాది విడుదలైన బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఇది ఒకటి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఏకంగా ప్రభాస్ ‘కల్కి’ చిత్రాన్ని బీట్ చేస్తూ అరుదైన ఘనత సాధించింది. ఇక ఇప్పుడు మరోసారి తెలుగులో గ్రామీణ నేపథ్యంలో మరో ప్రాజెక్ట్ తో రాబోతున్నాడు.
ఈ రోజు దుల్కర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌కి ‘ఆకాశంలో ఒక తార’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఆకాశమే హద్దు కాదు.. మీ హృదయాన్ని ఉర్రూతలూగించే కథతో మనందరిని మంత్రముగ్ధుల్ని చేసే మా స్టార్ హీరో దుల్కర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ ఆయన పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ తో సహా విడుదల చేశారు. అయితే ఈ మూవీలో ముందుగా సాయి పల్లవి హీరోయిన్ గా అనుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతోంది అని తెలిసి అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ లాస్ట్ లో స్వస్తిక అనే కథానాయికని ఓకే చేశారు. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ పూజ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది. త్వరలో ఈ షూటింగ్ పట్టాలెక్కనుంది.