Site icon NTV Telugu

Dulquer Salmaan: దుల్కర్‌ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ పాటలు సందడి మొదలయేది అప్పుడే ..!

Lucky

Lucky

Dulquer Salmaan Lucky Bhaskar: వేరు వేరు భాషల్లో, విభిన్న సినిమాలు చేస్తూ దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. గ‌త ఏడాది ‘సార్’ సినిమాతో రూ.100 కోట్ల కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌ల చేసిన టీజ‌ర్ ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకుంది.

Also Read; House of the Dragon: ఓటీటీలోకి వ‌చ్చేసిన హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సీజ‌న్ 2.. స్ట్రీమింగ్ ఎక్కడ అంటే..?

ఇదిలావుంటే నేడు బక్రీద్ పండుగ సంద‌ర్భంగా మూవీ నుంచి ఫ‌స్ట్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చారు మేక‌ర్స్.ఈ మూవీ ఫ‌స్ట్ సింగిల్‌ను జూన్ 19న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇక ఈ సినిమాలో దుల్కర్‌ సల్మాన్ బ్యాంకు ఉద్యోగిగా క‌నిపించ‌బోతున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ‘లక్కీ భాస్కర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Exit mobile version