Kantha : దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న పీరియడిక్ డ్రామా కాంత. నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్‌కి సిద్ధమైన ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు బయటకు వచ్చాయి. సమాచారం కాంత మూవీకి నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. అంటే థియేట్రికల్ రన్ తర్వాత ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది. దీంతో ఓటీటీ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. 1940–50 దశకాల నాటి నేపథ్యంతో ఈ మూవీ తెరకెక్కుతోంది.
Read Also : Shiva Re-Release : ఆర్జీవీ-నాగార్జున స్పెషల్ చిట్ చాట్.. వీడియో రిలీజ్
ఈ కథలో దుల్కర్ సల్మాన్ పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తున్నాడు. రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటించగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. చిత్రాన్ని సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేశాడు. పాత కాలం నాటి రాజకీయాలు, భావోద్వేగాలు, ప్రేమ, త్యాగం అన్నీ కలగలిసి సాగే ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించబోతుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అప్డేట్ రావడంతో సినిమా బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది.
Read Also : Nagarjuna – Konda Surekha : కొండా సురేఖకు భారీ ఊరట.. కేసు వాపస్ తీసుకున్న నాగర్జున
